STOCKS

News


ఫ్యూచర్‌ రిటైల్‌ లాభం రూ.175 కోట్లు

Thursday 15th November 2018
news_main1542258631.png-22027

న్యూఢిల్లీ: బిగ్‌ బజార్‌, ఎఫ్‌బీబీ, ఈజీడే, హెరిటేజ్‌ తదితర దుకాణాలను నిర్వహించే కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.175.1 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.153 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతానికి పైగా పెరిగింది. మొత్తం ఆదాయం సైతం రూ.4,506 కోట్ల నుంచి రూ.4,928 కోట్లకు వృద్ధి చెందింది. ఫ్యూచర్‌ రిటైల్‌కు దేశవ్యాప్తంగా 373 పట్టణాల్లో పలు బ్రాండ్లపై మొత్తం 1,336 స్టోర్లు ఉన్నాయి. బీఎస్‌ఈలో బుధవారం కంపెనీ షేరు 4 శాతం లాభపడి రూ.527.55 వద్ద ముగిసింది. 



You may be interested

ఐసీఐసీఐ డిపాజిట్‌ రేట్లు పావు శాతం పెంపు

Thursday 15th November 2018

ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్‌బీఐ రెండు సార్లు కీలక రేట్లను పెంచడం, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత మార్కెట్లో నిధుల లభ్యత తగ్గడం వంటి పరిస్థితుల నేపథ్యంలో డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మార్కెట్లలో అధిక అస్థిరత నెలకొనడంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయాలన్న ఆసక్తి కస్టమర్లలో తిరిగి ఆరంభమైందని ఐసీఐసీఐ రిటైల్‌ రుణాల విభాగం అధిపతి ప్రణవ్‌మిశ్రా

ట్రూజెట్‌... చిల్డ్రన్స్‌ డే ప్రయాణం!

Thursday 15th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన రంగ సంస్థ ‘ట్రూజెట్‌’ పేద పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 40 మంది పిల్లలను బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి సేలంకు తీసుకెళ్లింది. వీరంతా తమిళనాడుకు చెందిన ఎస్‌ఆర్‌వీవీ పాఠశాల విద్యార్థులు. వెల్లప సెంబనా గౌండర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సాయంతో పిల్లలకు విమానయాన అవకాశం కలిగింది. ‘వింగ్స్‌ ఆఫ్‌ హోప్‌’ కార్యక్రమం కింద ఏటా 300 మంది

Most from this category