STOCKS

News


మరింతగా పెరిగిన జీవీకే పవర్‌ నష్టాలు

Tuesday 13th August 2019
news_main1565676449.png-27731

జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రెట్టింపునకు మించి పెరిగాయి.  గత క్యూ1లో రూ.55 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.132 కోట్లకు పెరిగాయని జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,106 కోట్ల నుంచి రూ.1,042 కోట్లకు తగ్గిందని పేర్కొంది. జీవీకే కంపెనీ.. ఇంధన, విమానాశ్రయాలు, రవాణా, ఆతిధ్య, జీవ శాస్త్రాల రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.



You may be interested

ఫ్లిప్‌కార్ట్‌ సిబ్బందికి ఎన్‌ఎస్‌డీసీ శిక్షణ

Tuesday 13th August 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌డీసీ) ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 20,000 మంది డెలివరీ సిబ్బందికి ఎన్‌ఎస్‌డీసీ విభాగమైన లాజిస్టిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ శిక్షణ ఇవ్వనుంది. సరుకు రవాణా విధానం, స్థానిక రవాణా చట్టాలు, నిబంధనలు, కస్టమర్లతో ప్రవర్తించే తీరు వంటి అంశాల్లో సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. 

పసిడి 12డాలర్ల ర్యాలీ

Tuesday 13th August 2019

ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి ధర 12డాలర్ల మేరకు ర్యాలీ చేసింది. హాంగ్‌కాంగ్‌ నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమన భయాలతో అర్జెంటీనా కరెన్సీ క్షీణత పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 10డాలర్ల లాభంతో 1,527 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హాంగ్‌కాంగ్‌లోని ప్రధాన భూభాగం చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా ప్రారంభమైన

Most from this category