News


అనిల్‌ అంబానీ కంపెనీల నుంచి వైదొలగిన పీడబ్ల్యూసీ

Thursday 13th June 2019
news_main1560407749.png-26269

  • స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవికి గుడ్‌బై

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీల స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవి నుంచి పీడబ్ల్యూసీ వైదొలగింది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ అండ్‌ కో చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (పీడబ్ల్యూసీ) ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చే విధంగా స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవికి రాజీనామా చేసిందని, రెండు కంపెనీలూ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు నివేదించాయి. గత ఆర్థిక సంవత్సరం ఆడిట్‌కు  సంబంధించి పీడబ్ల్యూసీ కొన్ని పరిశీలనలకు సమాధానం కోరిందని, వాటికి సరైన స్పందన లేని కారణంగా రాజీనామా చేస్తున్నామని పీడబ్ల్యూసీ పేర్కొందని ఈ రెండు కంపెనీలు వెల్లడించాయి. పీడబ్ల్యూసీ పేర్కొన్న కారణాలకు తాము అంగీకరించడం లేదని తెలిపాయి. 
పీడబ్ల్యూసీ రాజీనామాను రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించింది. ఇక రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ నేడు(గురువారం) సమావేశమై కొత్త స్టాట్యుటరీ ఆడిటర్‌ ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. 
అడ్డంకులు సృష్టించాయ్‌...
నిర్దేశిత సమయాల్లో ఆడిట్‌ కమిటీ సమావేశాలను నిర్వహించడంలో ఇరు కంపెనీలు విఫలమయ్యాయని పీడబ్ల్యూసీ పేర్కొంది. ఆడిటర్‌గా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు అడ్డంకులు సృష్టించాయని, ఆడిట్‌ను పూర్తి చేయటంలో విఫలమయ్యామని, అందుకే రాజీనామా చేస్తున్నామని పీడబ్ల్యూసీ వెల్లడించింది. 
కాగా తమ గ్రూప్‌ కంపెనీల అన్ని అప్పులను సకాలంలోనే తీర్చివేస్తామని మంగళవారం నాడు రిలయన్స్‌ ​గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ భరోసా ఇచ్చారు. గత 14 నెలల్లో రూ.35,000 కోట్ల రుణాలు చెల్లించామని పేర్కొన్నారు.



You may be interested

వ్యక్తుల ఐటీ గరిష్ఠ శ్లాబు తగ్గాలి

Thursday 13th June 2019

25 శాతానికి తగ్గించాలన్న పీహెచ్‌డీసీసీఐ న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను గరిష్ట స్థాయి శ్లాబుని ప్రస్తుత 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) బుధవారం కేంద్రాన్ని కోరింది. ఈ నిర్ణయం వల్ల వ్యక్తుల వద్ద అదనపు డబ్బు ఉంటుందని, ఇది వ్యయాల పెంపునకు, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెరుగుదలకు దోహదపడుతుందని విశ్లేషించింది. జూలై 5వ తేదీ పార్లమెంటులో బడ్జెట్‌ను

బ్యాంకర్లతో ఈనెల 13న నిర్మల సమావేశం

Thursday 13th June 2019

రుణ ప్రవాహం సులభతరం చేయడమే ప్రధాన అజెండా న్యూఢిల్లీ: బడ్జెట్‌ ముందస్తు చర్చల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 13న (గురువారం) బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. రుణ ప్రవాహం సులభతరం చేయడమే ప్రధాన అజెండాగా ఈ చర్చలు కొనసాగనున్నట్లు వెల్లడైంది. ఆ తరువాత రోజైన 14న ప్రభుత్వ వర్గాల నుంచి ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన జరిగే అవకాశం ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ),

Most from this category