STOCKS

News


పీవీఆర్‌ లాభం రెట్టింపు

Saturday 11th May 2019
news_main1557555796.png-25680

  • క్యూలో రూ.48 కోట్లు నమోదు

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ ఆపరేటర్‌ పీవీఆర్‌ మార్చి త్రైమాసికం ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. సంస్థ లాభం రెట్టింపై రూ.47.75 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ.846 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.26 కోట్లు, ఆదాయం రూ.592 కోట్లుగా ఉన్నాయి. ఎస్‌పీఐ సినిమాస్‌ను కొనుగోలు చేసినందున మార్చి త్రైమాసికం ఫలితాలను, 2018-19 ఆర్థిక సంవత్సరం ఫలితాలను అంతక్రితం ఏడాది ఫలితాలతో పోల్చడానికి లేదని కంపెనీ పేర్కొంది. కంపెనీ వ్యయాలు రూ.771 కోట్లుగా ఉన్నాయి. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి పీవీఆర్‌ రూ.189 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.124కోట్లుగా ఉంది. ఆదాయం సైతం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.2,365 కోట్ల నుంచి రూ.3,118 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పీవీఆర్‌ కొత్తగా 138 స్క్రీన్లను పెంచుకుంది. ఎస్‌పీఐ సినిమాస్‌కు చెందిన స్క్రీన్లు కూడా ఇందులో ఉన్నాయి. నిర్వహణ పనితీరు విషయంలో గత ఆర్థిక సంవత్సరంలో కొత్త శిఖరాలను చేరామని, 750 స్క్రీన్ల మైలురాయిని అధిగమించామని పీవీఆర్‌ చైర్మన్‌, ఎండీ అజయ్‌ బిజ్లి తెలిపారు. ప్రతీ షేరుకు రూ.2 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 



You may be interested

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.3,418 కోట్లు

Saturday 11th May 2019

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.3,418 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.3,167 కోట్లు)తో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.41,091 కోట్ల నుంచి రూ.45,555 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు

సింగపూర్‌ సంస్థతో థామస్‌ కుక్ ఒప్పందం

Saturday 11th May 2019

న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన సెంటోసా డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రావెల్ సేవల సంస్థ థామస్ కుక్ తెలిపింది. మరింత మంది భారతీయ పర్యాటకులను సింగపూర్‌ సందర్శనకు తీసుకెళ్లేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. మరోవైపు, డెస్టినేషన్ వెడ్డింగ్‌ విభాగంలో కూడా ప్రవేశించనున్నట్లు సంస్థ వెల్లడించింది. మరికొద్ది నెలల్లో ఈ విభాగాన్ని ప్రారంభించనున్నట్లు, ఇందుకోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు థామస్‌ కుక్ ఇండియా సీఈవో మహేష్ అయ్యర్‌

Most from this category