STOCKS

News


ప్రయాణికుల వాహన విక్రయాల్లో క్షీణత

Saturday 9th February 2019
news_main1549698432.png-24107

  • జనవరిలో 2,80,125 వాహన అమ్మకాలు
  • క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం తక్కువ

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ రంగంలో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి నెలలోనూ ప్రయాణికుల వాహనాల్లో 2 శాతం క్షీణత నమోదైంది. మొత్తం 2,80,125 వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం సియామ్‌ తెలిపింది. పండుగ సీజన్‌లో అమ్మకాలు ఆశించినంత లేకపోవడంతో నిల్వలను తగ్గించుకోవడంపై తయారీదారులు దృష్టి పెట్టినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జనవరిలో అమ్ముడైన వాహనాలు 2,85,467 యూనిట్లుగా ఉన్నాయి.
- దేశీయంగా కార్ల విక్రయాలు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయి. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 2.65 శాతం తగ్గి 1,79,389 యూనిట్లుగా ఉన్నాయి.
- మారుతి సుజుకి ప్యాసింజర్‌ వాహన విక్రయాలు జనవరిలో 0.18 శాతమే పెరిగాయి. 1,39,440 వాహనాలను ఈ సంస్థ విక్రయించింది. ప్యాసింజర్‌ కార్ల అమ్మకాల వరకే చూస్తే 1,01,865 యూనిట్లుగా ఉన్నాయి. ఇది క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 4 శాతం తక్కువ.
- హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సైతం 0.65 శాతం అధికంగా 45,803 ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించింది. ఈ సంస్థ కార్ల అమ్మకాలు మాత్రం 1.58 శాతం తగ్గి 35,439 యూనిట్లుగా ఉండడం గమనార్హం.
- మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 0.88 శాతం వృద్ధితో 23,864 యూనిట్లుగా ఉన్నాయి.
- హోండా కార్లు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52 శాతం పెరిగాయి. 14,383 కార్లను విక్రయించింది.
ద్విచక్ర వాహనాలు
- ద్విచక్ర వాహన విక్రయాలు జనవరిలో 5.18 శాతం తగ్గి 15,97,572 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్‌ తెలిపింది.
- మోటారు సైకిళ్ల వరకే చూసినా 2.55 శాతం క్షీణతతో 10,27,810 యూనిట్లుగా ఉండడం గమనార్హం.
- హీరో మోటోకార్ప్‌ బైకుల అమ్మకాలు 4.95 శాతం తగ్గాయి. 5,16,451 వాహనాలను సంస్థ విక్రయించింది.
- బజాజ్‌ ఆటో అమ్మకాలు 24 శాతానికి పైగా పెరిగాయి. ఈ సంస్థ 2,03,358 బైకులను విక్రయించింది.
- హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా అమ్మకాలు 24 శాతం తగ్గి 1,28,525 యూనిట్లుగా ఉన్నాయి.
- మొత్తం స్కూటర్ల అమ్మకాలు 10 శాతం తగ్గి 4,97,169 యూనిట్లుగా ఉన్నాయి.



You may be interested

అక్టోబర్‌ - డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు

Saturday 9th February 2019

పెరిగిన నాగార్జున ఫెర్టిలైజర్స్‌ నష్టాలు డిసెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ రూ.179 కోట్ల నికరనష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.10 కోట్ల నష్టం పొందింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.1,439 కోట్ల టర్నోవరుపై రూ.352 కోట్ల నికరనష్టం చవిచూసింది. ఎమ్‌ఆర్‌పీఎల్‌ నష్టాలు రూ.268 కోట్లు దెబ్బతీసిన రిఫైనరీ మార్జిన్లు న్యూఢిల్లీ: మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌(ఎమ్‌ఆర్‌పీఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌

నోకియా 5.1 ప్లస్‌ మరిన్ని వేరియంట్లలో

Saturday 9th February 2019

హైదరాబాద్‌: హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా 5.1 ప్లస్‌ మోడల్‌లో అధిక ర్యామ్‌, స్టోరేజీతో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఇప్పటి వరకు 3జీబీ ర్యామ్‌, 32 జీబీ రామ్‌ మోడల్‌ మాత్రమే ఉండేది. ఇప్పుడు 4జీబీ/64జీబీ, 6జీబీ/64జీబీ వేరియంట్లను కూడా తీసుకొచ్చింది. ‘‘నోకియా 5.1 ప్లస్‌ను యూజర్లు ఎంతో అభిమానిస్తున్నారు. దీనికి అనుకూలంగా వారు ఎన్నో వేదికల్లో రేటింగ్‌ కూడా ఇస్తున్నారు. కనుక అధిక సామర్థ్యంతో కూడిన

Most from this category