STOCKS

News


పీఎన్‌బీ.. మళ్లీ లాభాల్లోకి..!

Wednesday 6th February 2019
news_main1549430715.png-24042

- క్యూ3లో రూ. 247 కోట్లు
- 7 శాతం వృద్ధి
- మొండిబాకీలకు తగ్గిన కేటాయింపులు

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో వరుసగా మూడు త్రైమాసికాల పాటు భారీ నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొత్తానికి మళ్లీ లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 247 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ. 230 కోట్లతో పోలిస్తే ఇది 7.12 శాతం అధికం. తాజాగా మొండిబాకీలకు కేటాయింపులు తగ్గటం ఇందుకు తోడ్పడింది. ఆదాయం సుమారు 3 శాతం క్షీణించి రూ. 15,257 కోట్ల నుంచి రూ. 14,854 కోట్లకు తగ్గింది. వరుసగా మూడు త్రైమాసికాలుగా నష్టాలు ప్రకటిస్తూ వస్తున్న పీఎన్‌బీ తాజా ఫలితాలు విశ్లేషకుల అంచనాలను తారుమారు చేశాయి. మూడో త్రైమాసికంలో పీఎన్‌బీ దాదాపు రూ. 1,063 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. "మా బాధ్యతలన్నీ నిర్వర్తించాం. (నీరవ్ మోదీ ఫ్రాడ్‌కి సంబంధించి) పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేశాము" అని పీఎన్‌బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మూడో క్వార్టర్‌లో దాదాపు రూ. 16,000 కోట్ల మేర మొండిబాకీలు రికవర్ కావడం కూడా పనితీరు మెరుగుపడటానికి తోడ్పడిందని వివరించారు.

తగ్గిన ఎన్‌పీఏలు..
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే తాజా క్యూ3లో ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 12.11 శాతం నుంచి 16.33 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్‌పీఏలు మాత్రం 8.90 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఆదాయ పన్ను కాకుండా మొత్తం ప్రొవిజనింగ్ రూ. 4,467 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి. ఇందులో మొండిబాకీలకు చేసిన కేటాయింపులు రూ. 2,566 కోట్లు (ఈ మొత్తంలో నీరవ్ మోదీ ఫ్రాడ్ ప్రొవిజనింగ్‌ సుమారు రూ. 2,014 కోట్లు). గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 2,996 కోట్లుగా ఉంది. మొండిబాకీలకు కేటాయింపులు సీక్వెన్షియల్‌గా చూస్తే 67 శాతం క్షీణించి రూ. 7,733 కోట్ల నుంచి రూ. 2,566 కోట్లకు తగ్గాయి.You may be interested

టెక్‌ మహీంద్రా లాభం రూ.1,203 కోట్లు

Wednesday 6th February 2019

-15 శాతం వృద్ధితో రూ.8,944 కోట్లకు మొత్తం ఆదాయం -21 శాతం పెరిగిన ఎబిటా -భవష్యత్తులో మార్జిన్లపై ఒత్తిడి న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,203 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.9,43 కోట్ల నికర లాభం వచ్చిందని, 28 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా తెలిపింది. ఆటోమేషన్‌ కారణంగా లాభ మార్జిన్‌ పెరిగిందని కంపెనీ

వృద్ధికి దోహదపడే బడ్జెట్‌ : మూడీస్‌

Wednesday 6th February 2019

న్యూఢిల్లీ: రైతులకు ప్రత్యక్షంగా నగదు బదిలీ, మధ్య తరగతికి ఊరటనిచ్చేలా పన్ను ప్రయోజన నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదపడే అంశాలని రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ అభిప్రాయపడింది. ఆయా చర్యలు వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచుతాయని, వినియోగం పెరుగుతుందని, ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపణగా పనిచేస్తాయని మూడీస్‌ వివరించింది. ఈ చర్యలు స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) వృద్ధి రేటును 0.45 శాతం మేర పెంచుతాయని కూడా మూడీస్‌ తన తాజా నివేదికలో

Most from this category