STOCKS

News


చత్తీస్‌ఘడ్‌కు పల్సస్‌ విస్తరణ

Thursday 9th August 2018
news_main1533793568.png-19093

 హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌ కంపెనీ పల్సస్‌ తాజాగా చత్తీస్‌ఘడ్‌కు విస్తరించింది. చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌సింగ్‌తో పల్సస్‌ సీఈఓ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబు భేటి అయిన సందర్భంగా ఈ విషయమై ఇరువురి మధ్యా ఒక అంగీకారం కుదిరినట్లు పల్సస్‌ తెలియజేసింది. వచ్చే ఏడాది కాలంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్... పల్సస్, ఒమిక్స్‌ సారథ్యంలో దంతేవాడ, రాజ్‌నందగావ్, రాయ్‌పూర్‌లో రానున్న సెజ్‌లలోని 3 కేంద్రాల్లో 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని శ్రీనుబాబు ఈ సందర్భంగా చెప్పారు. అలాగే వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని హిందీలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పల్సస్‌కు దేశంలోని 7 సెజ్‌ యూనిట్లలో కేంద్రాలున్నాయి. వీటిలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులున్నారు. ఇంకా యూకే, సింగపూర్, బెల్జియంలలోనూ సేవలందిస్తోంది.



You may be interested

18 ఏళ్ల గరిష్ఠానికి నిఫ్టీ పీఈ.. తస్మాత్‌ జాగ్రత్త!

Thursday 9th August 2018

కన్సాలిడేషనా? కరెక‌్షన్‌? సంశయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని నిపుణుల సూచన దేశీయ సూచీల రికార్డు ర్యాలీ కొనసాగుతూనే ఉంది. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ తొలిసారి 38 వేల పాయింట్లను తాకింది. 37వేల నుంచి 38 వేల పాయింట్ల ప్రయాణాన్ని సెన్సెక్స్‌ కేవలం 11 సెషన్లలో పూర్తి చేసింది. ఈ గమనంలో ఐసీఐసీఐ బ్యాంకు 11 శాతం, యాక్సిస్‌బ్యాంకు 10 శాతం, ఆర్‌ఐఎల్‌ 10 శాతం, టాటా స్టీల్‌ 8 శాతం, ఎస్‌బీఐ షేర్లు ర్యాలీ

అర్ధరాత్రి వరకూ ట్రేడింగ్‌కు రెడీ

Thursday 9th August 2018

ముంబై: ట్రేడింగ్‌ వేళలను అర్ధరాత్రి వరకూ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే‍్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సీఈఓ విక్రమ్‌ లిమాయే స్పష్టంచేశారు. సెబీ ఆదేశాలకు అనుగుణంగా ప్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో ట్రేడింగ్‌ను అక్టోబర్‌ 1 నుంచి రాత్రి 11.15 వరకూ పొడిగించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలు మొదలై 25 ఏళ్లు అయిన సందర్బంగా బుధవారం ఇక్కడ జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఆయన

Most from this category