STOCKS

News


ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు మూడింతలు

Monday 19th November 2018
news_main1542604878.png-22171

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 21 ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) నష్టాలు మూడున్నర రెట్లు పెరిగి రూ.14,716 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో పీఎస్‌బీల నష్టాలు రూ.4,284 కోట్లుగానే ఉండడం గమనార్హం. త్రైమాసికం వారీగా చూస్తే... జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు కాస్తంత మెరుగైంది. జూన్‌ క్వార్టర్లో రూ.16,615 కోట్ల మేర పీఎస్‌బీలు నష్టాలు చవిచూశాయి. వీటితో పోలిస్తే సెప్టెంబర్‌ క్వార్టర్లో నష్టాలు రూ.1,900 కోట్ల మేర తగ్గాయి. ఎన్‌పీఏలకు చేసిన అధిక కేటాయింపులతో వీటి బ్యాలన్స్‌ షీట్లపై పెద్ద ప్రభావమే పడింది. 
సెప్టెంబర్‌ క్వార్టర్లో అత్యధికంగా పీఎన్‌బీ రూ.4,532 కోట్ల నష్టాలను ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ బ్యాంకు రూ.560 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఐడీబీఐ బ్యాంకు రూ.3,602 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అలహాబాద్‌ బ్యాంకు రూ.1,822 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. జూన్‌ క్వార్టర్లో ఎస్‌బీఐ రూ.4,876 కోట్లు నష్టపోగా, సెప్టెంబర్‌ క్వార్టర్లో మాత్రం రూ.945 కోట్ల మేర లాభాన్ని నమోదు చేసింది. 21 ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు మార్చి క్వార్టర్లో రూ.62,681 కోట్లుగా ఉండడం గమనార్హం. 



You may be interested

వెలుగులో రియల్టీ షేర్లు

Monday 19th November 2018

సూచీల స్వల్ప లాభాల ట్రేడింగ్‌ భాగంగా సోమవారం రియల్టీ రంగ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ రంగంలోని​ ప్రధాన షేర్లైన ఒబేరాయ్‌ రియల్టి, సన్‌టెక్‌ షేర్ల లాభాల ట్రేడింగ్‌ రియల్టీ రంగ షేర్ల ర్యాలీకి ప్రధాన కారణమైంది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టి ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం లాభపడింది. ఉదయం గం.10:30ని.లకు ఇండెక్స్‌ 2శాతం లాభంతో 226.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సూచీలో

క్రూడ్‌, విదేశీ పెట్టుబడులు కీలకం

Monday 19th November 2018

ముంబై: చమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహం ఈ వారం మార్కెట్‌ పయనాన్ని నిర్ణయించనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం ఏ విధంగా ఉంటుంది? లిక్విడిటీ సమస్య నివారణకు ఆర్‌బీఐ సోమవారం (ఈ నెల 19న) నాటి భేటీలో తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో ఒడిదుడుకులు ఉంటాయని భావిస్తున్నారు. ‘‘రూపాయి కదలిక, చమురు ధరలు, విదేశీ పెట్టుబడులను ఇన్వెస్టర్లు

Most from this category