News


ఎగవేతదారుల లుకవుట్‌ సర్క్యులర్లు 

Friday 23rd November 2018
news_main1542948685.png-22332

  • ఇక బ్యాంకు సీఈఓలే జారీ చేస్తారు!!

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు, మోసగాళ్లు దేశం విడిచి పారిపోకుండా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సీఈవోలకు లుకవుట్‌ సర్క్యులర్లు జారీ చేయాలని కోరే అధికారాన్ని కేంద్రం కల్పించింది. పారిశ్రామికవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీలు పెద్ద ఎత్తున రుణ ఎగవేతలు, మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లుకవుట్‌ సర్క్యులర్‌ను జారీ చేయాలంటూ కేంద్ర హోం శాఖను కోరే అధికారాన్ని పీఎస్‌బీల చైర్మన్లు, ఎండీ, సీఈవోలకు కల్పిస్తూ కేంద్రం ఇటీవలే నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ అధ్యక్షతన గల అంతర్గత మంత్రిత్వ శాఖ చేసిన సిఫారసులకు అనుగుణంగా... కేంద్ర హోంశాఖ ఈ చర్యలు తీసుకుంది. దీనిని బ్యాంకింగ్‌ రంగ ప్రక్షాళణకు కొనసాగింపుగా రాజీవ్‌ కుమార్‌ అభివర్ణించారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు ఇది తీవ్ర ప్రతిబంధకం అవుతుందన్నారు. ఈ సవరణల నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులు ఎగువేతదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే వీలుంటుంది. 
ఎగువేతదారులకు చెక్‌!
వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ చోక్సీ పీఎన్‌బీని రూ.13,000 కోట్లకు పైగా మోసం చేసి విదేశాలకు పారిపోయిన తర్వాత... రూ.50 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న వారి పాస్‌పోర్ట్‌ వివరాలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కోరింది. ‘‘అయితే, పాస్‌పోర్ట్‌ వివరాలు ఒక్కటీ తెలుసుకుంటే సరిపోదు. దీనికితోడు ఎగవేతదారులకు వ్యతిరేకంగా లుకవుట్‌ సర్క్యులర్‌ జారీ చేయించే అధికారం బ్యాంకుల చీఫ్‌లకు కల్పించడం ద్వారా మరింత కఠినంగా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా ఇది నిరోధకంగా పనిచేస్తుంది. రుణదాత-రుణగ్రహీత సంబంధాన్నే మార్చేస్తుంది’’ అని రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. You may be interested

నిస్సాన్ చైర్మన్‌గా ఘోన్‌ తొలగింపు

Friday 23rd November 2018

టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై అరెస్టయిన కార్లోస్‌ ఘోన్‌... ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. కంపెనీ బోర్డు ఆయన్ను తొలగించినట్లు జపాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా సారథ్యం వహిస్తున్న ఘోన్‌ను తప్పించాలని ఏడుగురు సభ్యుల నిస్సాన్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు జపాన్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కె, బిజినెస్ డెయిలీ నికాయ్‌ వెల్లడించాయి. అనేక సంవత్సరాలుగా ఆదాయాన్ని తక్కువగా చూపుతున్నారన్న

పోటీతో టెల్కోల ఆదాయం అస్థిరం

Friday 23rd November 2018

ముంబై: తీవ్రమైన పోటీ కారణంగా టెలికం మార్కెట్‌ అస్థిరంగా మారిందని, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన డిజిటల్‌ ఇండియాకు ఇది హానికరమని దేశంలో అత్యధిక కస్టమర్లున్న వొడాఫోన్‌ ఐడియా సంస్థ సీఈవో బాలేష్‌ శర్మ పేర్కొన్నారు. వొడాఫోన్‌, ఐడియాల విలీనం తర్వాత తొలిసారిగా బాలేష్‌ శర్మ మీడియాతో మాట్లాడారు. వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోలను పరోక్షంగా ప్రస్తావిస్తూ... ‘‘ముగ్గురు ఆపరేటర్లూ నష్టాలనే ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని పెట్టుబడులు పెడతారని

Most from this category