STOCKS

News


23 శాతం తగ్గిన పీఎఫ్‌ఎస్‌ లాభం

Friday 31st August 2018
news_main1535694217.png-19825

న్యూఢిల్లీ: పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(పీఎఫ్‌ఎస్‌) కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.72 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.56 కోట్లకు తగ్గిందని పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.300 కోట్ల నుంచి రూ.325 కోట్లకు పెరిగిందని  కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ అశోక్‌ హల్దియా చెప్పారు. తాము ఇచ్చిన రుణాలు 22 శాతం వృద్ధితో రూ.13,361కు పెరిగాయని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ.90 కోట్లని, ఇది మొత్తం వడ్డీ ఆదాయంలో 30 శాతమని వివరించారు. ఒత్తిడి రుణాలు పరిష్కారమయ్యే దిశలో ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి రుణాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తి పరిష్కారం కనుగొనగలమని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో  పీఎఫ్‌ఎస్‌ షేర్‌ 6 శాతం లాభంతో రూ.19 వద్ద ముగిసింది. 



You may be interested

ఇన్వెస్టర్ల సొమ్ములు రీఫండ్‌ చేయండి

Friday 31st August 2018

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా వసూలు చేసిన సొమ్ములను తిరిగి చెల్లించాలని ప్రయాగ్‌ ఇన్ఫోటెక్‌ హై-రైజ్‌ కంపెనీకి మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీ ప్రస్తుత, మాజీ డైరెక్టర్లు మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ప్రయాగ్‌ ఇన్ఫోటెక్‌ కంపెనీ 2007-2008, 2011-12 కాలంలో రిడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లు(ఆర్‌పీఎస్‌) జారీ చేస్తామంటూ 1.57 లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.131 కోట్లు

రేటింగ్ అప్‌గ్రేడ్ చేయండి

Friday 31st August 2018

న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలంటూ అమెరికా రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీని కేంద్రం కోరింది. జీడీపీ-రుణ నిష్పత్తి దీర్ఘకాలికమైన అంశమని, రేటింగ్‌ను తక్షణం పెంచే విషయంలో దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరెంటు అకౌంటు లోటు (క్యాడ్‌) పెరుగుతుండటం, రూపాయి మారకం విలువ పతనమవుతండటం తదితర అంశాల నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ వర్గాలు గురువారం కేంద్ర ఆర్థిక శాఖతో

Most from this category