STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఆకర్షణీయం!

Tuesday 8th January 2019
news_main1546942422.png-23468

ఆకాశ్‌ జైన్‌
ప్రస్తుత మార్కెట్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని అజ్కాన్‌ గ్లోబల్‌ అనలిస్టు ఆకాశ్‌ జైన్‌ చెప్పారు. భూషన్‌ పవర్‌ సహా పలు కేసుల్లో విచారణ పూర్తయి బ్యాంకులకు త్వరలో పెద్ద మొత్తంలో రుణాలు వసూలు కానున్నాయని ఇటీవల ఆర్థిఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. దీనికితోడు ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీలో దాదాపు66 కేసులు పరిష్కారమై సుమారు రూ.80వేల కోట్లు బ్యాంకులకు రికవరీ అయ్యాయి. ఇదే సమయంలో బ్యాంకుల ఎన్‌పీఏలు కూడా క్రమంగా తగ్గుతూవస్తున్నాయి. బ్యాంకులు రుణాలిచ్చే విధివిధానాల్లో కీలక మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ కలిసి పీఎస్‌యూ బ్యాంకులను ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని ఆకాశ్‌ అంచనా వేశారు. 
మరికొన్నాళ్లు మార్కెట్లలో తీవ్ర కదలికలే ఉంటాయని, ఇకపై క్యూ3 సీజన్‌, అంతర్జాతీయ పరిణామాలను మార్కెట్‌ వర్గాలు పరిశీలిస్తుంటాయని చెప్పారు. క్యు2తో పోలిస్తే క్యు3 బలంగా ఉంటుందని అంచనా వేశారు. డిసెంబర్‌లో ఆటో కంపెనీల గణాంకాలు పేలవంగా ఉండడంతో ఆటో కంపెనీల షేర్లపై ఒత్తిడి ఉందన్నారు. వచ్చే నెల్లో ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌ మార్కెట్లలో కీలక మార్పులకు నాంది పలకవచ్చన్నారు. మూడు అసెంబ్లీల్లో ఓటమితో కేంద్రంలోని బీజేపీ ఇకపై ప్రజాకర్షక విధానాలను తీసుకువచ్చే ఛాన్సులున్నాయన్నారు. ఈ దశలో రాజకీయాలతో సంబంధం లేని, బలమైన మేనేజ్‌మెంట్‌, ఎర్నింగ్స్‌ ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లలో క్రమానుగత పెట్టుబడులు పెట్టాలని సలహా ఇచ్చారు.
కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సహా క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ఉన్న చిన్న, మధ్యతరహా స్టాకులను వాల్యూషన్ల ఆధారంగా ఎంచుకోవాలని ఆకాశ్‌ సూచించారు. ఇలాంటి పలు నాణ్యమైన స్టాకులు గతేడాది గరిష్ఠాలతో పోలిస్తే దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నాయని, వీటిలో మంచి వాటిని ఎంచుకోవాలని చెప్పారు. క్రూడాయిల్‌ ధరల పతనం పెయింట్‌ కంపెనీలకు కలిసివస్తుందని అంచనా వేశారు. ఇదే సమయంలో చమురు ధరల పతనం ఓఎంసీలను కుంగదీస్తుందన్నారు. You may be interested

లాభాల ముగింపు

Tuesday 8th January 2019

సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు అప్‌ రోజంతా ఒడుదుడుకులమయంగా సాగిన మంగళవారంనాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు ఎట్టకేలకు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో 35,980 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల పెరుగుదలతో 10,802 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  ఉదయం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైనా ఆసియా, యూరప్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్న నేపథ్యంలో కొన్ని హెవీవెయిట్‌ షేర్ల తగ్గుదల కారణంగా ఒక దశలో నిఫ్టీ 10,750 పాయింట్ల

ద్రవ్య లభ్యత సమస్యల్లేవు!

Tuesday 8th January 2019

- అవసరమైతే తగిన చర్యలు తీసుకుంటాం - ఇష్టానుసారం రైతు రుణ మాఫీలు సరికాదు - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పష్టీకరణ - చిన్న, లఘు, మధ్యతరహా ప్రతినిధులతో సమావేశం న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు లేవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఉద్ఘాటించారు. అవసరమైతే తగిన అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టంచేశారు. గవర్నర్‌ సోమవారం లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ప్రతినిధులతో

Most from this category