STOCKS

News


పీఎస్‌బీల రూ.7,300 కోట్ల ఎన్‌పీఏలు వేలానికి

Friday 24th August 2018
news_main1535089573.png-19588

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.7,300 కోట్ల మేర ఎన్‌పీఏలను ఖాతాల నుంచి వదిలించుకోనున్నాయి. వచ్చే నెలలో ఎస్‌బీఐ, దేనా బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకులు సంయుక్తంగా ఎన్‌పీఏలను వేలం వేయనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. బ్యాంకు ఆఫ్‌ ఇండియా 50 ఖాతాలకు సంబంధించి రూ.5,558 కోట్ల ఎన్‌పీఏలను సెప్టెంబర్‌ ఆరంభంలో వేలానికి ఉంచనుంది. ఎస్‌బీఐ రూ.383 కోట్ల ఎన్‌పీఏలకు బిడ్లను కూడా ఆహ్వానించింది. అలాహాబాద్‌ బ్యాంకు అయితే రూ.710 కోట్ల మేర 48 ఎన్‌పీఏలను వేలానికి ఉంచనుంది. దేనా బ్యాంకు కూడా రూ.658 కోట్ల విలువైన 87 ఎన్‌పీఏలను విక్రయించనుంది. జూన్‌ త్రైమాసికంలో లిస్టెడ్‌ బ్యాంకుల మొత్తం ఎన్‌పీఏలు రూ.10.09 లక్షల కోట్లకు పెరిగిపోవడం గమనార్హం. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి ఎన్‌పీఏలు రూ.8.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్‌బీఐ దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్న బ్యాంకు ఆఫ్‌ ఇండియా... ఇప్పటికే 50 ఎన్‌పీఏ ఖాతాలకు బిడ్లను ఆహ్వానించింది. బ్యాంకు ఆఫ్‌ ఇండియా విక్రయించదలిచిన ఎన్‌పీఏ ఖాతాల్లో లవాసా కార్పొరేషన్‌ (రూ.327 కోట్లు), సుజానా మెటల్‌ (రూ.411.6 కోట్లు), ఐఎస్‌ఎంటీ (రూ.423.7 కోట్లు), లిలిపుట్‌ కిడ్స్‌వేర్‌ (రూ.105 కోట్లు), కోబ్రా వెస్ట్‌ పవర్‌ (రూ.240 కోట్లు), జ్యోతి పవర్‌ (రూ.187కోట్లు), విసా పవర్‌ (రూ.145 కోట్లు) ఉన్నాయి. 



You may be interested

లాజిస్టిక్స్‌ కోసం త్వరలో ప్రత్యేక పోర్టల్

Friday 24th August 2018

న్యూఢిల్లీ: దేశ, విదేశ మార్కెట్లలో వాణిజ్య నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా త్వరలో జాతీయ స్థాయిలో నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఎగుమతి, దిగుమతి.. దేశీయంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను దీని ద్వారా అనుసంధానించనున్నట్లు ఆయన తెలియజేశారు. తద్వారా ఉద్యోగాల కల్పన, వాణిజ్యంలో పోటీతత్వం పెంచేందుకు ఇది ఉపయోగపడగలదని.. భారత్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తోడ్పడగలదని

యాప్స్‌ను నిషేధించం: టెలికం శాఖ

Friday 24th August 2018

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌, వాట్స్‌యాప్‌, టెలీగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌లపై నిషేధం విధించడం తమ ఉద్దేశం కాదని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ వివరణ ఇచ్చారు. కేవలం పక్కదారి పడుతున్న అంశాలను కట్టడి చేయడం పైన మాత్రమే తాము దృష్టిసారించామని వెల్లడించారు. దుర్వినియోగం అవుతున్న సమాచారానికి అడ్డుకట్ట వేయడం కోసం కృషిచేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ‘ఒక మెసేజ్‌ ఎక్కడ నుంచి మొదలైందని తెలుసుకోవడం కోసమే వ్యవస్థను ఏర్పాటుచేయమని

Most from this category