STOCKS

News


తగ్గనున్న మొండి బకాయిల భారం

Wednesday 29th August 2018
news_main1535519089.png-19737

ముంబై: భారత్‌ బ్యాంకుల స్థూల మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గనుందని  క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ- ఇక్రా విశ్లేషించింది. 2019 మార్చి నాటికి మొత్తం రుణాల్లో 10 శాతంగా ఉంటుందని అంచనావేస్తోంది. 2018 జూన్‌ 30 నాటికి భారత్‌ బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం 11.52 శాతం. ఇక నికర ఎన్‌పీఏల భారం ఈ ఏడాది జూన్‌ ముగిం‍పు నాటికి 5.92 శాతం ఉంటే 2019 మార్చి నాటికి ఈ రేటు 4.3 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది.  బ్యాంకింగ్‌ మొండిబకాయిల్లో దాదాపు 60 శాతం పరిష్కార క్రమంలో ఉన్నాయని, తన సానుకూల అంచనాలకు ఇదే కారణమని తాజా నివేదికలో పేర్కొంది. అయితే ఒకవేళ మొండిబకాయిల పరిష్కార క్రమం విఫలమయితే మాత్రం 2019 మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 12.2 శాతంగా, నికర మొండిబకాయిలు 5.6 శాతంగా ఉంటాయన్నది తమ అంచనా అని ఇక్రా పేర్కొంది. 



You may be interested

అమెజాన్‌ ‘ఈజీ’ సేవలు!

Wednesday 29th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తాజాగా ‘ఈజీ’ పేరుతో కొత్త సర్వీసులను ప్రకటించింది. చిన్న నగరాలు, పట్టణాల్లో కిరాణా, మందుల దుకాణాలు, మొబైల్‌ రీచార్జ్‌ పాయింట్స్‌ వంటి కేంద్రాలతో అమెజాన్‌ చేతులు కలిపి వాటిలో కంప్యూటర్లను ఏర్పాటు చేస్తోంది.  కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను ఈ ‘ఈజీ’ సెంటర్లలోని కంప్యూటర్ల ద్వారా అమెజాన్‌లో ఆర్డరు చేయొచ్చు. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని, డిజిటల్‌ చెల్లింపులు చేయలేని కస్టమర్లకు ఇవి

పడిపోయిన రూపాయి

Wednesday 29th August 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 22 పైసల నష్టంతో 70.32 వద్ద ప్రారంభమైంది. రూపాయి మునపటి ముగింపు 70.10గా ఉంది. దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణం. అలాగే పలు ఇతర కరెన్సీలతో పోల్చిచూసిన కూడా డాలర్‌ బలపడింది. ఇక అమెరికా డాలర్‌తో ఇండియన్‌ రూపాయి మారవ విలువ బుధవారం 70.05- 70.50 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది.

Most from this category