STOCKS

News


ఈ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెరిగింది!

Thursday 14th February 2019
news_main1550126601.png-24195

గతేడాది కాలంలో దాదాపు 80 కంపెనీల్లో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నట్లు గణాంకాలు చూపుతున్నాయి. ఈ 80 కంపెనీల స్టాకుల్లో 62 కంపెనీల స్టాకులు ఏడాది కాలంలో సుమారు 80 శాతం పతనమయ్యాయి. కేవలం 18 స్టాకులు మాత్రమే పాజిటివ్‌ రాబడులు చూపాయి. 80 స్టాకుల్లో ఎక్కువ శాతం చిన్న, మధ్యతరహా స్టాకులే ఉన్నాయి. గతేడాది మిడ్‌క్యాప్‌ కరెక‌్షన్‌లో ఈ స్టాకులు బాగా దెబ్బతిన్నాయి. ఎఫ్‌ఐఐలు విచ్చలవిడిగా అమ్మకాలకు దిగడంతో మార్కెట్లో లిక్విడిటీ క్షీణించింది. ఇదే సమయంలో భారీగా పతనమైన షేర్లను కంపెనీల ప్రమోటర్లు కొనుగోలు చేయడం జరిగింది. ఇలా ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న స్టాకుల్లో గార్నెట్‌ ఇంటర్నేషనల్‌, మన్‌పసంద్‌ బెవరేజెస్‌, కైటెక్స్‌ గార్మెంట్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, యూపీఎల్‌, బజాజ్‌ హోల్డింగ్స్‌, అతుల్‌ఆటో, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, రేమండ్‌, అశోక్‌బిల్డ్‌కాన్‌ ఉన్నాయి. 
ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న కంపెనీల్లో వెయ్యికోట్ల మార్కెట్‌ క్యాప్‌ కన్నా ఎక్కువ మార్కెట్‌క్యాప్‌ ఉన్న 16 కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి...

కంపెనీ పనితీరు, వృద్ది అవకాశాలపై అధిక నమ్మకం ఉన్నప్పుడే ప్రమోటర్లు వాటాలు పెంచుకోవడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ బాగోగుల గురించి ప్రమోటర్‌కు తెలిసినట్లు ఎవరికీ తెలియదని, భవిష్యత్‌పై భరోసా ఉంటేనే ప్రమోటర్‌ బైబ్యాక్‌ చేస్తాడని చెప్పారు. అందువల్ల ప్రమోటర్లు వాటాలు పెంచుకోవడమనేది సాధారణంగా షేరుపై పాజిటివ్‌ ప్రభావం చూపుతుందని విశ్లేషించారు. అయితే ఇన్వెస్టర్లు కేవలం ఈ ఒక్క అంశాన్నే గమనించకుండా, ఇతర పారామీటర్లను సైతం పరిశీలించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. షేరు ధర పతనమయ్యేందుకు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలు కారణమైతే అలాంటి షేర్లకు దూరంగా ఉండాలని సూచించారు. 



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాలు

Thursday 14th February 2019

గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ లాభం రెండు రెట్లు న్యూఢిల్లీ: గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రెండు రెట్లకు పైగా పెరిగింది. గత క్యూ3లో రూ.51 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.121 కోట్లకు ఎగసిందని గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,169 కోట్ల నుంచి రూ.2,576 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి 17

రూ.50 కోట్లతో ఎన్‌సీఎల్‌ వెకా ప్లాంట్‌

Thursday 14th February 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్‌సీఎల్‌ వెకా హైదరాబాద్‌ శివారులో ప్లాంట్‌ను ప్రారంభించింది. మెదక్‌ జిల్లా ముచ్చెర్లలోని ఈ ప్లాంట్‌ను బుధవారం తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. 16.8 ఎకరాల్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 18 ఎక్స్‌ట్రూడర్‌ లైన్స్‌ ఉన్నాయని.. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో

Most from this category