News


యూనిటెక్‌ ప్రమోటర్ల బెయిల్‌కు సుప్రీం నో

Thursday 24th January 2019
news_main1548307328.png-23777

న్యూఢిల్లీ: యూనిటెక్‌ ప్రమోటర్లు సంజయ్‌ సంద్ర, అజయ్‌ చంద్రలకు బెయిల్‌ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. గృహ కొనుగోలుదారులను కోట్లాది రూపాయిల మేర మోసం చేశారన్న ఆరోపణలపై వీరు అరెస్టయ్యారు. అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద రూ.750 కోట్ల డిపాజిట్‌ చేయాలని 2017 అక్టోబర్‌ 30వ తేదీన ఇచ్చిన ఆదేశాలను రియల్టీ గ్రూప్‌  పాటించనందున వారికి బెయిల్‌ మంజూరు చేయడం లేదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాలతో కూడిన డివిజనల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. దాదాపు ఏడాదిన్నర నుంచీ తీహార్‌ జైలులో ఉంటున్న వీరు, ఇప్పటికి దాదాపు రూ.400 కోట్లు డిపాజిట్‌ చేశారు. 2015లో దాఖలైన ఒక క్రిమినల్‌ కేసులో వీరివురూ బెయిల్‌ కోరారుç. గురుగ్రామ్‌లోని యూనిటెక్‌ ప్రాజెక్ట్స్- ‘వైల్డ్‌ ఫ్లవర్‌ కంట్రీ’, ‘అంథియా ప్రాజెక్ట్‌’లో గృహాలు కొనుగోలు చేసిన 158 మంది తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.
రిఫండ్స్‌కు కావాల్సింది రూ.2,000 కోట్లు!
కాగా యూనిటెక్‌ ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసిన వారు దాదాపు 16,000 మంది. వీరిలో కొందరు తమకు ఫ్లాట్స్‌ ఇవ్వాలని కోరుకుంటుంటే, మరికొందరు డబ్బు వెనక్కు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.  ఒకవేళ రిఫండ్స్‌ జరిగితే, తిరిగి ఇవ్వాల్సిన మొత్తం దాదాపు రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా. అటు ఫ్లాట్స్‌ స్వాధీనం కోరుకుంటున్నవారు కానీ ఇటు డబ్బు వెనక్కు ఇవ్వాలని కానీ కోరుతున్న వారి సంఖ్య మొత్తం 9,390 మంది ఉన్నారని ఈ కేసులో అమెకస్‌ క్యూరీగా (న్యాయస్థానానికి సలహాదారు) ఉన్న న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వీరిలో 4,700 మంది రిఫండ్‌ను కోరుకుంటున్నారని తెలిపారు.



You may be interested

ఆర్‌బీఐ యూటర్న్‌?

Thursday 24th January 2019

రేట్‌కట్‌ దిశగా మొగ్గు చూపవచ్చంటున్న నిపుణులు రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ తన పంథాను మార్చుకోవచ్చని రాయిటర్స్‌ పోల్‌లో పాల్గొన్న ఎకానమిస్టులు అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి నెల సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ తన ధృక్పధాన్ని న్యూట్రల్‌గా మార్చవచ్చని, జూన్‌ నుంచి రేట్ల తగ్గింపు మొదలుబెట్టవచ్చని అంచనా వేశారు. ఒక్క నెల్లోనే ఎకానమిస్టుల అంచనాల్లో భారీ తేడా వచ్చింది. వచ్చే త్రైమాసికం నుంచి ఆర్‌బీఐ రేట్లను పెంచుతుందని ఎక్కువమంది ఎకానమిస్టులు గత నెల సర్వేలో అభిప్రాయపడ్డారు.

ద్వితియార్ధంలో చిన్నస్టాకులదే హవా

Thursday 24th January 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  గతేడాది అధ్వాన్న ప్రదర్శన చూపిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాకులు ఈ ఏడాది గాడిన పడతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌హెడ్‌ దీపక్‌ జసాని అభిప్రాయపడ్డారు. భారత్‌లాంటి పెద్ద దేశంలో అనేక కంపెనీలుంటాయని, వీటిలో చిన్న, మధ్యతరహా కంపెనీల్లో కొన్ని నాణ్యమైనవి ఉంటాయని చెప్పారు. డౌన్‌ట్రెండ్‌ సమయాన ఎంత నాణ్యమైన చిన్నస్టాకైనా పతనమవడం తప్పదని, కానీ మంచి కంపెనీల్లో కరెక‌్షన్‌ చూసి భయపడకూడదని తెలిపారు. లార్జ్‌ క్యాప్స్‌తో పోలిస్తే చిన్నస్టాకులతోనే సంపద

Most from this category