STOCKS

News


టీవీ, గృహోపకరణాల ధరలకు రెక్కలు

Monday 26th November 2018
news_main1543213548.png-22382

  • 7-8 శాతం మేర పెంపు
  • పండుగలు ముగియడంతో అమల్లోకి

న్యూఢిల్లీ: టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ వ్యయాలు పెరిగినప్పటికీ ఇటీవల పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు రేట్ల పెంపును కాస్తంత వాయిదా వేసుకున్నాయి. దీంతో వాటి మార్జిన్లపై ప్రభావం ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం కంపెనీలపై భారం పెరిగేలా చేసింది. ఈ పరిస్థితులను అధిగమించి, తమ మార్జిన్లను బలోపేం చేసుకునేందుకు కంపెనీలు ధరల పెంపును చేపట్టాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే పెంచగా, ప్యానాసోనిక్‌ ఇండియా 7 శాతం మేర తన ఉత్పత్తుల ధరలను పెంచనుంది. ‘‘గత కొన్ని నెలలుగా రూపాయి క్షీణిస్తూ రావడం వల్ల మా తయారీ వ్యయాలపై ప్రభావం పడింది. అయితే, చాలా వరకు మేం సర్దుబాటు చేసుకున్నాం. కానీ మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే నెల నుంచి 5-7 శాతం స్థాయిలో పెంచక తప్పడం లేదు’’ అని ప్యానాసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్‌ మనీష్‌ శర్మ తెలిపారు. పండుగల తర్వాత నుంచి తాము రేట్ల పెంపును చేపట్టినట్టు హయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజ సైతం తెలిపారు. కంపెనీల వార్షిక విక్రయాల్లో మూడింట ఒకవంతు దసరా, దీపావళి సమయంలోనే జరుగుతుంటాయి. సెప్టెంబర్‌లో 3-4 శాతం మేర ధరలు పెంచినప్పటికీ అవి ఇంకా ఆచరణ రూపం దాల్చలేదని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. ఎంఆర్‌పీ పెంచినప్పటికీ డిమాండ్‌ తగ్గడం, మార్కెట్‌ వాటా కోసం బ్రాండ్ల మధ్య పోటీతో అమల్లోకి రాలేదని వివరించింది. తమ టెలివిజన్ల ధరలను పెంచే ఆలోచనేదీ లేదని సోనీ స్పష్టం చేసింది. పండుగల సీజన్‌ ముగియడంతో కంపెనీలు క్రమంగా ధరలను పెంచుతున్నాయని గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ హెడ్‌ కమల్‌ నంది తెలిపారు.You may be interested

రూ.20లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి

Monday 26th November 2018

ప్ర: నా వయస్సు 77 సంవత్సరాలు. నేను అధిక పన్ను స్లాబ్‌లో ఉన్నాను. ఇటీవలే నేను తీసుకున్న కొన్ని పాలసీల్లో ఒకటి మెచ్యూర్‌ అయింది.రూ.20 లక్షలు వచ్చాయి. ఈ మొత్తా‍న్ని దేంట్లో ఇన్వెస్ట్‌ చేస్తే బావుంటుంది. నేను నష్ట భయాన్ని ఓ మోస్తరుగా భరించగలను. తగిన సలహా ఇవ్వండి. -షణ్ముఖ రావు, హైదరాబాద్‌ జ: మీ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయండి. ద్రవ్యోల్బణం కంటే కూడా అధిక

దివాలా చట్టంతో మంచి ఫలితాలు

Monday 26th November 2018

రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏల పరిష్కారం కార్పొరేట్‌ శాఖ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్‌ న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ) వచ్చిన రెండేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏల పరిష్కారానికి అవకాశం ఏర్పడినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు. ఐబీసీ 2016 డిసెంబర్‌ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రాగా, ఇప్పటి వరకు 9,000 ఎన్‌పీఏ కేసులు ఈ చట్టం కింద పరిష్కారం కోసం వచ్చినట్టు

Most from this category