News


ఆధార్‌ స్వచ్చంద వినియోగ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం

Monday 4th March 2019
news_main1551673574.png-24415

న్యూఢిల్లీ: ఆధార్‌ నంబర్‌ను గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా మొబైల్‌ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు స్వచ్చందంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ ఆమోదం తెలిపారు. మొబైల్‌ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ వినియోగాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆర్డినెన్స్‌తో ఇకపై వీటికి ఆధార్‌ను వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, రాజ్యసభ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆధార్‌ వినియోగానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే, గోప్యత హక్కుకు భంగం వాటిల్లితే కఠిన జరిమానాలను ప్రభుత్వం ఇందులో ప్రతిపాదించింది. పౌరులు స్వచ్చందంగా ఆధార్‌ను సమర్పిస్తే... కోర్‌ బయోమెట్రిక్‌ సమాచారం, ఆధార్‌ నంబర్‌ను నిల్వ చేసుకోవడాన్ని నిషేధించింది. అదే సమయంలో ఆధార్‌ ఇవ్వని వారికి బ్యాంకు ఖాతాల ప్రారంభం, మొబైల్‌ సిమ్‌కార్డుల జారీని తిరస్కరించరాదని ఆర్డినెన్స్‌ నిర్దేశించింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే సంస్థలపై రూ.కోటి జరిమానా, అదే పనిగా ఉల్లంఘనలు కొనసాగితే ప్రతీ రోజుకు రూ.10 లక్షల చొప్పున జరిమానాలు ఇందులో ఉన్నాయి.You may be interested

నిఫ్టీ తక్షణ అవరోధం 10940

Monday 4th March 2019

వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్‌ బ్రేకులు వేయడం, అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల అధ్యక్షులూ త్వరలో సంతకాలు చేయవచ్చన్న వార్తలతో గతవారం పలు ప్రపంచ ప్రధాన మార్కెట్లు నెలల గరిష్టస్థాయిలో ముగిసినప్పటికీ, హఠాత్తుగా ఇండో-పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ ఫలితంగా భారత్‌ సూచీలు పరిమితశ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల వేగాన్ని పెంచడంతో ఇక్కడి భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావాన్ని చూపించలేదని భావించవచ్చు.

అనధికారిక సర్‌చార్జీలతోనే డిజిటల్ చెల్లింపులకు విఘాతం

Monday 4th March 2019

ఐఐటీ ముంబై అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: అనధికారిక సర్‌చార్జీలు, మర్చంట్ డిస్కౌంట్ రేట్లలో (ఎండీఆర్‌) వ్యత్యాసాలు మొదలైనవే దేశీయంగా డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ప్రతిబంధకాలుగా ఉంటున్నాయని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ ముంబై ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇలాంటి వాటివల్ల చిన్న/మధ్య స్థాయి వ్యాపారులు, కస్టమర్లు నష్టపోతున్నారని, ఫలితంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదని తెలిపింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ఎ౾ండీఆర్‌ల మధ్య వ్యత్యాసాల

Most from this category