14 దేశాలకు విస్తరించిన ‘ప్రీతి’
By Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగు దశాబ్దాలుగా వంటింటి ఉపకరణాల్లో దిగ్గజ బ్రాండ్‌గా రాణిస్తున్న ఫిలిప్స్ ఇండియా అనుబంధ సంస్థ ‘ప్రీతి’ కిచెన్ అప్లయన్సెస్ ఉత్పత్తులు, ప్రస్తుతం 14 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సంస్థ ఎండీ సుబ్రమణియన్ శ్రీనివాసన్ చెప్పారు. 1978లో ఏర్పాటు చేసిన ప్రీతి సంస్థ 40వ వార్షికోత్సవం సందర్బంగా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రీతి ఉత్పత్తుల తయారీ ప్లాంట్‌ను ‘రాయల్ ఫిలిప్స్’ పర్సనల్ హెల్త్ ఛీఫ్ బిజినెస్ లీడర్ రాయ్ జాకబ్స్ చేతుల మీదుగా శుక్రవారం చెన్నైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసన్ మాట్లాడుతూ... ప్రీతి నుంచి 13 రకాల ఉత్పత్తులు అందిస్తున్నట్లు తెలియజేశారు. మిక్సర్, గ్రైండర్ కేటగిరిలో ప్రీతి ఉత్పత్తులు దేశంలో పదేళ్లుగా ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయని చెప్పారు. ‘‘దేశంలోని 8 రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు, 96 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. కిచెన్ ఉత్తుత్తుల అమ్మకాల్లో 20 శాతం వాటా మాదే. ఇక్కడి నుంచే 14 దేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాం’’ అని వివరించారు. ‘‘ఇప్పటిదాకా మా తయారీ సామర్థ్యం ఏడాదికి 80 వేల యూనిట్లు. తాజా ప్లాంటు పూర్తి సామర్థ్యం 2 మిలియన్లు. కొత్త ఫ్యాక్టరీ ద్వారా ప్రస్తుతం ఉత్పత్తిని 1.20 మిలియన్ యూనిట్లకు చేరుస్తాం’’ అని చెప్పారాయన.
You may be interested
మూడోరోజూ లాభాల ముగింపే
Saturday 17th November 2018ప్రపంచమార్కెట్లో పసిడి ధర వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిసింది. గతరాత్రి అమెరికా మార్కెట్ల పతనంతో పాటు, డాలర్ ఇండెక్స్ పతనంతో అక్కడి మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 8డాలర్లు పెరిగి 1,223.00 డాలర్ల వద్ద ముగిసింది. రాత్రి టెక్నాలజీ షేర్ల పతనంతో అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లు టెలికాం, యూటిలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన షేర్లు ర్యాలీ చేయగా, వినిమయ, టెక్నాలజీ, ఇండస్ట్రీస్ రంగాలకు
మరో 200 మంది నియామకం:రియల్‌పేజ్
Saturday 17th November 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్ ఎస్టేట్ రంగానికి సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్ సేవలు అందిస్తున్న రియల్‌పేజ్ వచ్చే ఏడాదిలోగా మరో 200 మందిని నియమించుకోనుంది. యూఎస్‌కు చెందిన ఈ సంస్థకు హైదరాబాద్ కార్యాలయంలో 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. డేటా అనలిటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో ఇక్కడి టీమ్ నైపుణ్యత సంస్థ విస్తరణలో కీలకమని రియల్‌పేజ్ సీవోవో అశ్లే గ్లోవర్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా