STOCKS

News


పవర్‌​‍గ్రిడ్‌ నికర లాభం రూ.2,309 కోట్లు

Tuesday 6th November 2018
news_main1541481019.png-21742

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్‌ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ నికర లాభం (స్డాండ్‌అలోన్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 8 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.2,141 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 2,309 కోట్లకు పెరిగిందని పవర్‌ గ్రిడ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,493 కోట్ల నుంచి రూ.8,690 కోట్లకు ఎగసింది. పవర్ ట్రాన్సిమిషన్‌ విభాగం ఆదాయం రూ.5,771 కోట్ల నుంచి రూ.7,104 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.45 మధ్యంతర డివిడెండ్‌, రూ.2.80 తుది డివిడెండ్‌... మొత్తం రూ.5.25 డివిడెండ్‌ను చెల్లించినట్లు పవర్‌గ్రిడ్‌ తెలిపింది.
 



You may be interested

ధంతేరాస్‌లో మెరిసిన పసిడి

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: పసిడి కొనుగోళ్లకు శుభప్రదమైన రోజుగా భావించే ధంతేరాస్‌లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ధరలు భారీగా ఉండడం, దీనికితోడు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్యలు ఉండడంతో ధంతేరాస్‌నాడు అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండచ్చని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్‌ కొనసాగుతుందన్నందు, వచ్చే వారాల్లో పసిడి, ఆభరణాల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనావేస్తున్నారు. ఆభరణాలకన్నా, నాణేలకు అధికంగా డిమాండ్‌

పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 33 శాతం అప్‌

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 33 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.190 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.253 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయంరూ.1,274 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.1,808 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎమ్‌డీ సంజయ గుప్తా తెలిపారు.

Most from this category