STOCKS

News


ప్రత్యేక కంపెనీగా పోస్టల్‌ ఇన్సూరెన్స్‌

Thursday 31st January 2019
news_main1548907876.png-23913

  • కేబినెట్‌ నోట్‌ పంపాం
  • రెండు వారాల్లో ఆమోదం!
  • సమాచార మంత్రి సిన్హా వెల్లడి

న్యూఢిల్లీ: పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని పోస్టల్‌ శాఖ భావిస్తోంది. పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్యకలాపాలను ఒక ప్రత్యేక వ్యాపార విభాగంగా (సపరేట్‌  బిజినెస్‌ యూనిట్‌) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు కేబినెట్‌ నోట్‌ను పంపామని సమాచార శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా  చెప్పారు. రెండు వారాల్లో ఈ నోట్‌ను కేబినెట్‌ ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశారు. మొదటి దశలో ఎస్‌బీయూను, రెండో దశలో పూర్తి స్థాయి బీమా కంపెనీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)రెండో వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఇటీవల ఐపీపీబీ 1.26 లక్షల యాక్సెస్‌ పాయింట్లను ఏర్పాటు చేసిందని, మరో పది రోజుల్లో మరో పదివేల యాక్సెస్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్నదని వివరించారు.



You may be interested

తనఖా.. తడాఖా చూపిస్తోంది!

Thursday 31st January 2019

భారీగా షేర్లను కుదువ పెడుతున్న ప్రమోటర్లు జీ షేర్ల పతనంతో ఉలిక్కిపడ్డ మార్కెట్‌- రుణదాతల విక్రయంతో ఈ  కంపెనీలు మరింత పతనం- ప్రమోటర్ల తనఖా షేర్లు పెరిగితే ప్రమాదమే!- దూరంగా ఉంటేనే మేలంటున్న నిపుణులు (సాక్షి, బిజినెస్‌ విభాగం) ప్రమోటర్లు తమ వాటాలను తనఖా పెట్టి... వాటిపై భారీగా రుణాలు తీసుకుని... ఆ రుణాలను వేరేచోట పెట్టుబడులుగా పెట్టడం ఇపుడు కొత్త సమస్యలకు దారితీస్తోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ షేర్ల ఉదంతంతో ఇలాంటి కంపెనీలపై

ప్రభుత్వం వైపు చూస్తున్న బ్యాంకింగ్‌ పరిశ్రమ

Thursday 31st January 2019

బడ్జెట్‌లో అధిక నిధులపై పీఎస్‌బీల ఆశ- బ్యాంకు ఖాతాలపై జీఎస్టీ హేతుబద్ధీకరణ దేశవ్యాప్తంగా ఒకే స్టాంప్‌ డ్యూటీ 80సీ కింద డిపాజిట్‌ కాల వ్యవధి తగ్గించాలి- వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపును రూ.30వేలు చేయాలి- బడ్జెట్‌ఫై బ్యాంకింగ్‌ రంగం ఆకాంక్షలు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బ్యాంకింగ్‌ రంగం... వచ్చే బడ్జెట్‌పై భారీ ఆశలు కాకపోయినా కనీసం కొన్ని కీలకమైన చర్యలు అయినా ఉంటాయని ఆశిస్తోంది. భారీ ఎన్‌పీఏలు, ఎన్‌పీఏ కేసుల దివాలా

Most from this category