STOCKS

News


సెప్టెంబర్‌ 1 నుంచి పోస్టల్‌ బ్యాంకు సేవలు

Thursday 30th August 2018
news_main1535606322.png-19786

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) సేవలు సెప్టెంబర్‌ 1న ఆరంభం కాబోతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇవి ప్రారంభమవుతాయి. ‘‘ప్రారంభమైన రోజు నుంచే దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3,250 సేవల పాయింట్లు అందుబాటులోకి వస్తాయి’’ అని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్‌సిన్హా బుధవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. డిసెంబర్‌ నాటికి మొత్తం 1.55 లక్షల పోస్టాఫీసులను ఐపీపీబీతో అనుసంధానించడం పూర్తవుతుందని, ఇందులో 1.30 లక్షల శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవేనని మంత్రి చెప్పారు. సేవింగ్స్‌, కరెంట్‌ అకౌంట్లు, నగదు బదిలీ, ప్రత్యక్ష నగదు బదిలీ, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు తదితర సేవల్ని ఐపీపీబీ ఆఫర్‌ చేయనుంది. పోస్టాఫీసు సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులు ఐపీపీబీ సేవలను పొందొచ్చని, ఇందుకోసం ఖాతాలను అనుసంధానించుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 
ఐపీపీబీకి మరో రూ.635 కోట్లు
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) దేశవ్యాప్త ఆవిష్కరణకు మూడు రోజుల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.800 కోట్లతో ఐపీపీబీ ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించగా, నిధుల కేటాయింపులను మరో 635 కోట్లు పెంచి రూ.1,435 కోట్లకు ఆమోదం తెలియజేస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ సంబంధిత వ్యయాల కోసం రూ.400 కోట్లు, మానవ వనరుల కోసం రూ.235 కోట్లు కలిపి మొత్తం రూ.635 కోట్లు అదనంగా ఐపీపీబీకి లభించనున్నాయి. 
 తెలంగాణలోనూ సెప్టెంబర్‌ 1 నుంచే
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు సేవలు తెలంగాణ రాష్ట్రంలో 23 శాఖలు, 115 యాక్సెస్‌ పాయింట్లలో సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం అవుతాయని తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. 17 కోట్లకు పైగా పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాదారులతో కలిపి ఐపీపీబీకి ఇప్పటికే దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్టు ఆయన చెప్పారు. డిసెంబర్‌ నాటికి 1.55 లక్షల తపాలా కార్యాలయాలను పేమెంట్స్‌ బ్యాంకు సేవలతో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొన్నారు. ‘‘సాధారణ పౌరుడికి సైతం విశ్వసనీయ, అందుబాటు ధరల్లో, విస్తృతమైన బ్యాంకింగ్‌ సేవలను అందించడమే ఐపీపీబీ ఏర్పాటు ఉద్దేశ్యం. బ్యాంకింగ్‌ సేవలను అందరికీ చేరువ చేసే విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించడమే’’ అని చంద్రశేఖర్‌ వివరించారు. You may be interested

25 ​‍ప్రాజెక్ట్‌లను అమ్మేస్తాం

Thursday 30th August 2018

ముంబై: మౌలిక రంగ కంపెనీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ త్వరలో రైట్స్‌ ఇష్యూకి రాబోతోంది. అలాగే  ఆస్తులను విక్రయించి రూ.30,000 కోట్ల మేర రుణ భారం తగ్గించుకోవాలని కూడా యోచిస్తోంది.  ఈ రెండు ప్రతిపాదనలకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపినట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది. ఒక్కో షేర్‌ రూ.150 చొప్పున 30 కోట్ల ఈక్విటీ షేర్లను రైట్స్‌ ఇష్యూ ద్వారా జారీ చేసి రూ.4,500 కోట్లు సమీకరిస్తామని తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూ

కేంద్రానికి ఆర్‌బీఐ రూ.50వేల కోట్ల డివిడెండ్‌

Thursday 30th August 2018

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2018 జూన్‌తో ముగిసిన తన ఆర్థిక సంవత్సరంలో (2017-18) కేంద్రానికి రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మొత్తం బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉంది. అలాగే కేంద్ర ద్రవ్యలోటు కట్టడికి (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం - చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం) కూడా ఈ మొత్తం దోహదపడుతుందని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూలై-జూన్‌ కాలాన్ని తన ఆర్థిక సంవత్సరంగా ఆర్‌బీఐ

Most from this category