హైదరాబాద్ వద్ద పోకర్ణ కొత్త ప్లాంటు
By Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్స్టైల్, గ్రానైట్ రంగాల్లో ఉన్న పోకర్ణ గ్రూప్... తన గ్రానైట్ విభాగానికి సంబంధించి హైదరాబాద్ వద్ద అత్యాధునిక ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. క్వాంట్రా బ్రాండ్‌తో సహజ క్వార్ట్జ్ సర్ఫేసెస్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్‌కు ఇప్పటికే వైజాగ్‌లో ఒక యూనిట్ ఉంది. హైదరాబాద్ వెలుపల కొత్తూరు వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక ప్లాంటును ఏర్పాటు చేస్తామని, దీనిపై రూ.330 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని సంస్థ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలియజేశారు. ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారాయన. ‘‘ఫ్యాక్టరీ పనులు మొదలుపెట్టాం. 2020 జనవరి- మార్చిలో నిర్మాణం పూర్తవుతుంది’’ అని వెల్లడించారు.
ఇక భారత్‌పైనా ఫోకస్..
క్వాంట్రా ఉత్పత్తులను క్వార్ట్ట్జ్ రాయి, పాలిమర్ రెసిన్తో తయారు చేస్తారు. ఈ సర్ఫేసెస్ గ్రానైట్ కంటే బలంగా ఉంటాయి. విదేశాల్లో కిచెన్ టాప్స్‌గా వీటిని వాడతారు. ఇటలీకి చెందిన బ్రెటన్‌స్టోన్ పేటెంటెడ్ టెక్నాలజీని కంపెనీ వినియోగిస్తోంది. 75 రంగుల్లో వీటిని రూపొందిస్తున్నారు. యూఎస్, యూరప్, కెనడాల్లో క్వాంట్రాకు మంచి డిమాండ్ ఉంది. మొత్తం 15 దేశాలకు కంపెనీ ఎగుమతి చేస్తోంది. క్వాంట్రా ఆదాయం మొత్తం దాదాపు విదేశాల నుంచే సమకూరుతోంది. హైదరాబాద్ ప్లాంటు అందుబాటులోకి వస్తే ఇక నుంచి భారత్‌లో క్వాంట్రాను మార్కెట్ చేయనున్నట్టు గౌతమ్ చంద్ వెల్లడించారు. ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు సైతం నెలకొల్పుతామన్నారు. ప్రస్తుతం దేశీయంగా ఫర్నీచర్ కంపెనీ ఐకియాకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారాయన.
అదనంగా రూ.350 కోట్లు..
వైజాగ్ ప్లాంటు వార్షిక సామర్థ్యం 4 లక్షల చదరపు మీటర్లు. ఈ కేంద్రం పూర్తి స్థాయి వినియోగానికి చేరుకుంది. దీంతో కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పుతున్నట్టు గౌతమ్ చంద్ తెలియజేశారు. ‘కొత్త కేంద్రం వార్షిక సామర్థ్యం 6 లక్షల చదరపు మీటర్లు ఉంటుంది. 2017-18లో రూ.328 కోట్ల పోకర్ణ ఆదాయంలో క్వాంట్రా వాటా రూ.180 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ టర్నోవర్ రూ.400 కోట్లు ఆశిస్తున్నాం. ఇందులో క్వాంట్రా ద్వారా రూ.250 కోట్లు సమకూరుతాయని మా విశ్వాసం. హైదరాబాద్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రూ.350 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. తొలి ఏడాది 50- 60 శాతం, రెండేళ్లలో 100 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకుంటాం. గ్రూప్‌లో ఉద్యోగుల సంఖ్య 1,500 ఉంది’ అని చెప్పారాయన.
You may be interested
భారత్‌లో వివో ఆర్అండ్డీ సెంటర్!
Wednesday 28th November 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీ సంస్థ వివో భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ఇండియా ఇన్నోవేషన్ టీమ్ పనిచేస్తోంది. భారత మార్కెట్‌కు ఎటువంటి ఫీచర్లు, టెక్నాలజీ అవసరమో అన్న అంశంపై ఈ బృందం పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తోందని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపుణ్ మార్యా తెలిపారు. వై95 మోడల్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా
‘విస్తరిస్తున్న’ కార్పొరేట్ల సేవ
Wednesday 28th November 2018న్యూఢిల్లీ: ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించిన మాదిరిగానే భారత కార్పొరేట్లు తమ సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తరిస్తున్నారు. దీంతో సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాల కోసం వీరు వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం కోసం చేసిన నిధుల వ్యయం 11 శాతం పెరిగింది. రూ.10,030 కోట్లను ఇందుకు ఖర్చు చేయడం విశేషం. ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన 1,795 కంపెనీల్లో