STOCKS

News


అదనపు మూలధనంపై పీఎన్‌బీ కసరత్తు

Thursday 27th September 2018
news_main1538023526.png-20621

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అదనంగా మరింత మూలధనం సమకూర్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా కేంద్రం నుంచి రూ. 5,431 కోట్లు సమకూర్చుకునే ప్రతిపాదనను పరిశీలించేందుకు గురువారం బ్యాంక్ బోర్డు సమావేశం కానుంది. ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల నుంచి అనుమతి తీసుకునే క్రమంలో అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) నిర్వహించే తేదీలను కూడా ఇందులో ఖరారు చేయనుంది. స్టాక్ ఎక్స్చేంజీలకు పీఎన్‌బీ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో మంగళవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ‍జైట్లీ.. మూలధనంపరంగా ఆయా బ్యాంకులకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పీఎన్‌బీ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలధనం తగినంతగా ఉండేలా చూసే క్రమంలో అయిదు బ్యాంకులకు కేంద్రం జూలైలో రూ. 11,336 కోట్లు సమకూరుస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో పీఎన్‌బీ కూడా ఉంది. మరోవైపు, రెండో విడత కింద మరింత మూలధనం సమకూర్చే అంశానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ)తో చర్చల ప్రక్రియ ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. రీక్యాపిటలైజేషన్ ప్రణాళికను మరికాస్త ముందుగానే అమలు చేయాలని దాదాపు అన్ని బ్యాంకులు కోరినట్లు ఆయన వివరించారు.


PNB

You may be interested

నూతన టెలికం పాలసీకి కేబినెట్‌ పచ్చజెండా

Thursday 27th September 2018

నూతన టెలికం విధానం ‘నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ (ఎన్‌డీసీపీ) 2018’కి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను రాబట్టడంతోపాటు 2022 నాటికి 40 లక్షల ఉద్యోగాల కల్పన ఈ విధానం లక్ష్యాలుగా ఉన్నాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అంతర్జాతీయంగా చాలా వేగంగా మారుతున్నాయని... ముఖ్యంగా 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మెషిన్‌ టు మెషిన్‌ కమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరిస్థితి ఉందని కేంద్ర టెలికం మంత్రి

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ నుంచి ‘నిధుల’ ప్రతిపాదన లేదు: ఎస్‌బీఐ

Thursday 27th September 2018

ముంబై: సంక్షోభంలో ఉన్న ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నుంచి అదనపు నిధులు కావాలంటూ ఎటువంటి నిర్మాణాత్మక ప్రతిపాదన తమకు రాలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో ఎస్‌బీఐకి 6.42 శాతం వాటా ఉంది. పలు డెట్‌ చెల్లింపుల్లో ఇటీవల ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు విఫలమైన విషయం తెలిసిందే. ఈ గ్రూపునకు మొత్తం రూ.91,000 కోట్ల రుణ భారం ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నుంచి నిర్మాణాత్మక ప్రతిపాదన తమ ముందుకు వచ్చినప్పుడు దానిపై

Most from this category