STOCKS

News


పీఎన్‌బీ నష్టం @ రూ.940 కోట్లు

Tuesday 7th August 2018
news_main1533627625.png-19012

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ రూ.940 కోట్ల నికర నష్టా‍న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.343 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే మార్కెట్‌ వర్గాల అంచనా కన్నా ఈ నష్టాలు తక్కువగా ఉండటం గమనార్హం. త్రైమాసికం పరంగా చూస్తే బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏఎలు 18.38 శాతం నుంచి 18.26 శాతానికి, నికర ఎన్‌పీఏలు 11.24 శాతం నుంచి 10.58 శాతానికి తగ్గాయి. వీటిని విలువ పరంగా చూస్తే.. త్రైమాసికం పరంగా స్థూల ఎన్‌పీఏలు రూ.86,620 కోట్ల నుంచి రూ.82,889 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ.48,684 కోట్ల నుంచి రూ.43,872 కోట్లకు తగ్గాయి. 
నికర వడ్డీ ఆదాయం రూ.4,692 కోట్లుగా ఉంది. ఇది అంచనాలు కన్నా ఎక్కువగా నమోదయ్యింది.
కేటాయింపులు రూ.5,758 కోట్లుగా ఉన్నాయి. గత త్రైమాసికంలో ఇవి రూ.20,353 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఇవి రూ.2,608 కోట్లు. అంటే ఇవి త్రైమాసికం పరంగా తగ్గితే, వార్షికంగా పెరిగాయి. 
ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు ధర మధ్యాహ్నం 1:07 సమయంలో 2.44 శాతం క్షీణతతో 87.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


pnb

You may be interested

మహీంద్రా లాభం 67 శాతం జంప్‌

Tuesday 7th August 2018

యుటిలిటీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలు వెల్లడించింది. కంపెనీ నికర లాభం 67 శాతం వృద్ధితో రూ.1,257 కోట్లకు పెరిగింది. ఇది మార్కెట్‌ అంచనాలను మించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ రూ.752 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 23 శాతం వృద్ధితో

30 స్టాకుల్లో ఎంఎసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌!

Tuesday 7th August 2018

దేశీయ సూచీలు ర్యాలీ మూడ్‌లో ఉన్నాయి. బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 30 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఎక్సైడ్‌ బ్యాటరీస్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఎంఅండ్‌ఎం, తల్వాకర్స్‌, జుబిలాంట్‌ ఫుడ్‌సైన్సెస్‌, గృహ్‌ ఫైనాన్స్‌,

Most from this category