STOCKS

News


పీఎన్‌బీకి స్వల్పంగా తగ్గిన మొండిబాకీలు

Monday 27th August 2018
news_main1535346319.png-19663

న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో దెబ్బతిన్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొండిబాకీలు జూలైలో స్వల్పంగా తగ్గాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రావాల్సిన బకాయిలు 1.8 శాతం మేర తగ్గి రూ. 15,175 కోట్లకు పరిమితమయ్యాయి. దాదాపు రూ. 25 లక్షల పైగా రుణాలు తీసుకుని డిఫాల్ట్ అయిన వారిని ఉద్దేశపూర్వక భారీ ఎగవేతదారులుగా పీఎన్‌బీ పరిగణిస్తోంది. జూన్ ఆఖరు నాటికి ఇలాంటి రుణగ్రహీతల నుంచి రూ. 15,355 కోట్లు రావాల్సి ఉండగా.. జూలై ఆఖరు నాటికి ఈ మొత్తం రూ. 15,175 కోట్లకు తగ్గింది. బ్యాంకు స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ. 82,889 కోట్లుగా ఉన్నాయి. పీఎన్‌బీ ఇచ్చిన మొత్తం రుణాల్లో వీటి వాటా 18.26 శాతం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఎన్‌బీ రూ. 7,700 కోట్ల మేర బకాయిలను రాబట్టుకోగలిగింది. కేవలం పీఎన్‌బీ నుంచి భారీగా రుణాలు పొందిన సంస్థల్లో విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యుయలరీ (సుమారు రూ. 900 కోట్లు), ఫరెవర్ ప్రెషియస్ జ్యుయలరీ అండ్ డైమండ్స్ (రూ. 748 కోట్లు), జూన్ డెవలపర్స్ (రూ. 410 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. కన్సార్షియంలో భాగంగా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ (రూ. 597 కోట్లు), కుడోస్ కెమీ (రూ. 1,302 కోట్లు) వంటి సంస్థలకు కూడా భారీగానే రుణాలు ఇచ్చింది. 



You may be interested

ఇక పూర్తిగా చిప్ డెబిట్ కార్డులే

Monday 27th August 2018

న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రస్తుత మాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సూచించింది. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి చార్జీలు ఉండవని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. నకిలీ కార్డు మోసాలకు ఆస్కారమివ్వని ఈఎంవీ (యూరోపే, మాస్టర్‌కార్డ్‌, వీసా) చిప్

అన్‌లిస్టెడ్‌ కంపెనీల కొత్త షేర్లు డీమ్యాట్‌ రూపంలోనే !

Monday 27th August 2018

న్యూఢిల్లీ: అన్‌లిస్టెడ్‌ కంపెనీలు ఇక నుంచి జారీచేసే కొత్త షేర్లను డీమెటీరియలైజ్‌డ్‌(డీమ్యాట్‌) రూపంలోనే జారీ చేయాలని త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. నల్లధనం నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నదని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. అంతే కాకుండా అన్‌లిస్టెడ్‌ కంపెనీలు షేర్ల బదిలీని డీమ్యాట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ రూపంలోనే బదిలీ చేయాల్సి ఉంటుందని, ఈ మార్పులు అక్టోబర్‌ మొదటి వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని

Most from this category