STOCKS

News


పాత కార్యాలయం అమ్మకంపై పీఎన్‌బీ కసరత్తు

Thursday 9th August 2018
news_main1533791529.png-19067

ముంబై: నష్టాలు, మొండిబాకీల భారం నుంచి కోలుకునే దిశగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని భికాజీ కామా ప్లేస్‌లోని తమ పాత ప్రధాన కార్యాలయ భవంతిని విక్రయించడంపై కసరత్తు చేస్తోంది. ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సయిజ్ వంటి పలు ప్రభుత్వ విభాగాలతో చర్చలు జరుపుతోంది. భారీ డిమాండ్ నెలకొనడంతో ప్రాపర్టీ విలువను రెండోసారి మదింపు చేస్తున్నట్లు పీఎన్‌బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. అయిదారు నెలల క్రితం తొలిసారి మదింపు చేసినట్లు, అప్పట్నుంచి ప్రాపర్టీ రేట్లతో పాటు డిమాండ్ కూడా పెరగడంతో రెండో విడత వేల్యుయేషన్ చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్‌వీ ప్రభాకర్ తెలిపారు. పాత ప్రధాన కార్యాలయం అమ్మకం ద్వారా రూ. 700-800 కోట్లు సమీకరించాలని పీఎన్‌బీ భావిస్తోంది. ప్రధాన వ్యాపారేతర అసెట్స్ విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 8,600 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. మొండిబాకీలకు అధిక ప్రొవిజనింగ్ కారణంగా జూన్ త్రైమాసికంలో పీఎన్‌బీ రూ. 940 కోట్ల నష్టం ప్రకటించింది.


PNB

You may be interested

రూ.2.14 లక్షల కోట్ల షేర్లు తనఖాలోనే!!

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: బీఎస్‌ఈలో లిస్టైయిన కంపెనీలలోని ప్రమోటర్ల తనఖా షేర్ల విలువ జూలై చివరినాటికి రూ.2.45 లక్షల కోట్లకు చేరుకుని 14.60 శాతం పెరుగుదలను నమోదుచేసినట్లు ఎక్స్ఛేంజ్‌ సమాచారంలో వెల్లడయింది. జూన్‌ 30 నాటికి ఈ మొత్తం రూ.2.14 లక్షల కోట్లుగా నమోదైంది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలలో 400 వరకు కంపెనీల ప్రమోటర్లు 30 శాతానికి మించి తమ వాటాలను తనఖా పెట్టినట్లు వెల్లడి కాగా, ఈ మొత్తం విలువ రూ.1.29

పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు నుంచి రుణాలు

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో జట్టు కట్టడం ద్వారా రుణాలు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఉత్పత్తులను అందించేందుకు సన్నద్ధమవుతోంది. థర్డ్‌ పార్టీ టై అప్‌ ద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తరఫున రుణాలును ఆఫర్‌ చేయనుంది. అలాగే, బీమా ఉత్పత్తులను అందించేందుకు బజాజ్‌ అలియంజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 21న ప్రధాన మంత్రి

Most from this category