STOCKS

News


పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 33 శాతం అప్‌

Tuesday 6th November 2018
news_main1541480975.png-21741

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 33 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.190 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.253 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయంరూ.1,274 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.1,808 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎమ్‌డీ సంజయ గుప్తా తెలిపారు.  ఇక స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.208 కోట్లకు, ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.1,730 కోట్లకు పెరిగాయని వివరించారు. 

గత క్యూ2లో 0.34 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 0.45 శాతానికి పెరిగాయని గుప్తా  పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 0.26 శాతం నుంచి 0.35 శాతానికి ఎగిశాయని వివరించారు. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి రూ.51,320 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది అదే నెల నాటికి 43 శాతం వృద్ధితో రూ.73,482 కోట్లకు చేరాయని పేర్కొన్నారు.  రుణ నాణ్యత, లాభదాయకత, బ్యాలన్స్‌డ్‌ పోర్ట్‌ఫోలియో వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని వివరించారు. 

భారీగా నిధులు సమీకరణ
తమకు ఎలాంటి లిక్విడిటీ సమస్యలు లేవని సంజయ్‌ గుప్తా స్పష్టం చేశారు.   ఈ ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో 17.5 శాతంగా ఉన్న స్వల్ప కాలిక రుణ వడ్డీరేటు ఈ సెప్టెంబర్‌ క్వార్టర్లో 11.7 శాతానికి తగ్గిందని తెలిపారు. గత నెలలో వాణిజ్య పత్రాల జారీ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించామని, అంతే కాకుండా విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీ-ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయిం‍గ్స్‌) ద్వారా 20 కోట్ల డాలర్లు సమీకరించామని పేర్కొన్నారు.  

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 0.25 శాతం నష్టపోయి రూ.873 వద్ద ముగిసింది. 



You may be interested

పవర్‌​‍గ్రిడ్‌ నికర లాభం రూ.2,309 కోట్లు

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్‌ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ నికర లాభం (స్డాండ్‌అలోన్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 8 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.2,141 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 2,309 కోట్లకు పెరిగిందని పవర్‌ గ్రిడ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,493 కోట్ల నుంచి రూ.8,690 కోట్లకు ఎగసింది. పవర్ ట్రాన్సిమిషన్‌ విభాగం ఆదాయం రూ.5,771 కోట్ల నుంచి రూ.7,104

తీవ్రమైన పోటీ ఉంటే.. ఒత్తిడీ ఉంటుంది..

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: పోటీ తీవ్రంగా ఉన్న రంగాల్లో కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఎదిగే క్రమంలో ఇలాంటి సవాళ్లు సహజమేనన్నారు. ఎకానమీ వృద్ధి చెందే కొద్దీ ఒక్కో నియంత్రణ సంస్థ పోషించాల్సిన పాత్ర పరిధి కూడా విస్తృతమవుతుంటుందని ఆయన పేర్కొన్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.

Most from this category