STOCKS

News


పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం 50 శాతం అప్‌

Friday 10th August 2018
news_main1533897864.png-19145

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 50 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.170 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.256 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,160 కోట్ల నుంచి రూ.1,616 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ సంజయ గుప్తా తెలియజేశారు. వడ్డీ ఆదాయం 28 శాతం ఎగసి రూ.433 కోట్లకు చేరుకుంది. గత క్యూ1లో 3.1 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ1లో 2.74 శాతానికి తగ్గింది. అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించామని గుప్తా వివరించారు. వడ్డీరేట్లు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో లాభదాయకత మరింతగా మెరుగుపడగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. స్థూల మొండి బకాయిలు 0.43 శాతంగా, నికర మొండి బకాయిలు 0.33 శాతంగా ఉన్నాయని గుప్తా తెలిపారు. కంపెనీ రుణ మంజూరీలు 25 శాతం వృద్ధితో రూ.9,767 కోట్లకు పెరిగాయని గత క్యూ1లో రూ.46,755 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ క్యూ1లో రూ.68,578 కోట్లకు ఎగిశాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 0.47 శాతం లాభంతో రూ.1,304 వద్ద ముగిసింది. 



You may be interested

భూషణ్‌ స్టీల్‌ మాజీ ప్రమోటర్‌ సింఘాల్‌ అరెస్ట్‌

Friday 10th August 2018

న్యూఢిల్లీ: భూషణ్‌ స్టీల్‌ మాజీ ప్రమోటర్‌ నీరజ్‌ సింఘాల్‌ను ఎస్‌ఎఫ్‌ఐఓ (సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌) అరెస్ట్‌ చేసింది. రూ.2,000 కోట్లకుపైగా నిధులు స్వాహా చేసిన కేసులో ఆయన నిందితుడు. సంస్థ నిధుల అవకతవకలకు సంబంధించి ఎస్‌ఎఫ్‌ఐఓ అరెస్ట్‌ చేసిన మొట్టమొదటి వ్యక్తి సింఘాల్‌ అని ఉన్నతాధికారులు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. భూషణ్‌ స్టీల్‌కు అనుబంధంగా ఉన్న వివిధ కంపెనీల్లో వినియోగానికి

రిటైల్ రుణాలపై జాగ్రత్త వహించాలి

Friday 10th August 2018

ముంబై: కార్పొరేట్ రుణాల్లో మొండిబాకీల భారం పెరిగిందనే ఉద్దేశంతో.. రిటైల్ రుణాలవైపు మళ్లుతున్న బ్యాంకర్లు జాగ్రత్త వహించాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యుటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి రిటైల్ రుణాలు మోక్ష మార్గం కాదని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. "రిటైల్ రుణాల్లో నిర్వాణ (మోక్షమార్గం) వెతుక్కుంటున్న ప్రతి బ్యాంకరు కొంత జాగ్రత్త

Most from this category