STOCKS

News


చౌక్సీ కోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు.. ఇంటర్‌పోల్‌కు ఈడీ ‘రిమైండర్’

Tuesday 11th September 2018
news_main1536641842.png-20149

న్యూఢిల్లీ: ఆభరణాల వర్తకుడు మెహుల్‌ చోక్సీకోసం రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా ఇందుకు సంబంధించి మరో ‘రిమైండర్‌ నోటీసు’ పంపింది.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు 2 బిలియన్‌ డాలర్ల మేర మోసం చేసి, చోక్సీ దేశం నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. చోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేయాలని జూన్‌లో (ముంబై కోర్టులో చోక్సీపై ఈడీ చార్జ్‌షీట్‌ దాఖలైన వెంటనే) ఇంటర్‌పోల్‌కు ఈడీ దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం కావాలని ఇంటర్‌పోల్‌ కోరింది. దీనితో మరిన్ని వివరాలు అందిస్తూ ఈడీ తాజా ‘రిమైండర్‌’ అప్లికేషన్‌ దాఖలు చేసింది. అంతర్జాతీయ అరెస్టు వారంటుగా పరిగణించే ఇంటర్‌పోల్ రెడ్‌ కార్నర్ నోటీసు (ఆర్‌సీఎన్‌) జారీ అయిన పక్షంలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్తులను ఇంటర్‌పోల్‌లో సభ్యత్వం ఉన్న 192 దేశాల్లో ఎక్కడున్నా అరెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత వారిని స్వదేశాల అధికారులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. పీఎన్‌బీని దాదాపు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసులో వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీపై ఇప్పటికే ఈ తరహా నోటీసు జారీ అయ్యింది.



You may be interested

ఆసియా-పసిఫిక్‌ జీడీపీలో పెరిగిన భారత్‌ వాటా!

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: ఆసియా-పరిఫిక్‌ ప్రాంత స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో భారత్‌ వాటా గత 17 సంవత్సరాల్లో రెండున్నర శాతానికి పైగా పెరిగింది. 2000లో 14.6 శాతంగా ఉన్న ఈ వాటా 2017లో 17.3 శాతానికి పెరిగిందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది.  ‘ఆసియా-పసిఫిక్‌ 2018 ఆర్థిక పరిస్థితుల్లో కీలకాంశాలు’ పేరుతో విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - మొత్తం ప్రపంచ ఉత్పత్తి (జీడీపీ)లో ఆసియా పసిఫిక్‌

‘జాక్‌ మా’ వరసుడిగా డేనియల్ జాంగ్

Tuesday 11th September 2018

బీజింగ్‌: అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు జాక్‌ మా వెల్లడించారు. 420 బిలియన్‌ డాలర్ల (30,43,131 కోట్లు) ఈ-కామర్స్ దిగ్గజానికి తన తరువాత వరసుడిగా ప్రజాదరణ పొందిన ‘సింగిల్‌ డే సేల్‌’ ప్రచార రూపకర్త సీఈఓ డేనియల్ జాంగ్‌ను ప్రకటించారు. సోమవారం తన 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించిన జాక్‌ మా.. వచ్చే ఏడాది సెప్టెంబరు 10న జాంగ్‌ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు

Most from this category