STOCKS

News


రూ. 637 కోట్ల నీరవ్ మోదీ ఆస్తులు జప్తు

Tuesday 2nd October 2018
news_main1538451540.png-20780

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను (పీఎన్‌బీ) మోసం చేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీకి దేశవిదేశాల్లో ఉన్న రూ. 637 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం వెల్లడించింది. భారత్‌తో పాటు బ్రిటన్‌, అమెరికా తదితర దేశాల్లో స్థిరాస్తులు, జ్యుయలరీ, ఫ్లాట్స్‌, బ్యాంక్ బ్యాలెన్స్‌ల రూపంలో ఈ అసెట్స్ ఉన్నట్లు వివరించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఆదిత్య నానావతిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పీఎన్‌బీని నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ చోక్సీలు దాదాపు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
జప్తు చేసిన మోదీ ఆస్తుల్లో న్యూయార్క్‌లోని సెంట్రల్‌ పార్క్‌లో రూ.216 కోట్ల విలువ చేసే రెండు అపార్ట్‌మెంట్‌లున్నట్లు ఈడీ పేర్కొంది. ఇథాకా ట్రస్ట్ ‍పేరుతో వీటిని కొనుగోలు చేశారని, దీని లబ్ధిదారు నీరవ్ మోదీ భార్య అమీ మోదీ అని వివరించింది. దుబాయ్‌, బహమాస్‌, అమెరికా, సింగపూర్ తదితర దేశాల నుంచి ఈ ట్రస్ట్‌లోకి నిధులు వచ్చాయని తెలిపింది. మరోవైపు, లండన్‌లోని మెర్లిబోన్‌లో సుమారు రూ. 57 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను కూడా అటాచ్ చేసినట్లు వివరించింది. దీనికి మోదీ సోదరి పుర్వి లబ్ధిదారుగా ఉన్నారు. వీటితో పాటు దాదాపు రూ. 278 కోట్లు ఉన్న ‍అయిదు బ్యాంక్ ఖాతాలను కూడా ఈడీ అటాచ్ చేసింది. కేసుకు సంబంధించి హాంకాంగ్ ‍నుంచి రూ. 23 కోట్ల వజ్రాభరణాలు భారత్‌కు వెనక్కి తీసుకొచ్చింది. అటు పుర్వి పేరిట ముంబైలో ఉన్న ఫ్లాట్‌ను కూడా ఈడీ అటాచ్ చేసింది. You may be interested

క్రూడ్‌ ధరలు అప్‌.. ఆటో అమ్మకాలు డౌన్‌

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబరులో నెమ్మదించాయి. పలు దిగ్గజ ఆటో కంపెనీల ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు క్షీణతను నమోదుచేయగా.. మరికొన్ని కంపెనీల విక్రయాలు కేవలం ఒక్క అంకె వృద్ధి రేటుకే పరిమితమైపోయాయి. ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతూ గతనెల వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇదే సమయంలో పలు చోట్ల లోటు వర్షపాతం నమోదుకావడం, మరికొన్ని ప్రాంతాల్లో

ఆధార్‌తో ‘గుర్తింపు’ను ఆపేయండి

Tuesday 2nd October 2018

న్యూఢిల్లీ: వినియోగదారుల గుర్తింపునకు  ఆధార్‌ను ఉపయోగించే  ప్లాన్‌ను 15 రోజుల్లోగా ఆపేయాలని    టెలికం కంపెనీలను యూఐడీఏఐ ఆదేశించింది. ఈ మేరకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఆధార్‌ వినియోగంపై సుప్రీం కోర్ట్‌ ఇటీవలనే స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఆధార్‌ విషయమై సుప్రీం కోర్ట్‌ ఇటీవల వెలువరించిన తీర్పుకు అనుగుణంగా టెలికం కంపెనీలు చర్యలు తీసుకోవాలని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్‌తో వినియోగదారుల గుర్తింపు

Most from this category