STOCKS

News


ఐబీఏ చైర్మన్‌గా సునీల్‌ మెహతా

Saturday 1st September 2018
news_main1535779612.png-19857

ముంబై: ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) చైర్మన్‌గా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ మెహతా ఎంపికయ్యారు. 2018-19 కాలానికి ఈయనను చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది. ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్రను ఎన్నుకున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్లుగా ఉన్న ఎస్‌బీఐ కొత్త చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్‌ బ్యాంక్‌ ఎండీ శ్యామ్‌ శ్రీనివాసన్‌ యథావిధిగా కొనసాగుతారని వెల్లడించింది. 



You may be interested

కోక-కోలా చేతికి కోస్టా కాఫీ బ్రాండ్‌

Saturday 1st September 2018

లండన్‌: శీతల పానీయాల దిగ్గజ సంస్థ, కోక-కోలా కంపెనీ కోస్టా ​కాఫీ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన విట్‌బ్రెడ్‌ కంపెనీ నుంచి ఈ కోస్టా కాఫీ బ్రాండ్‌ను 510 కోట్ల డాలర్లు(390 కోట్ల పౌండ్లు-)కు అంతా నగదు రూపంలోనే కొనుగోలు చేశామని కోక-కోలా కంపెనీ తెలిపింది. బ్రిటన్‌లో అతి పెద్ద కాఫీ కంపెనీగా కోస్టా కాఫీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్‌లో 2,400కు పైగా, 30 దేశాల్లో 1,400 వరకూ

ఎనిమిది మౌలిక రంగాలూ బాగున్నాయ్‌!

Saturday 1st September 2018

న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక పారిశ్రామిక విభాగం వృద్ధి జూలైలో బాగుంది. వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి రేటు కేవలం 2.9 శాతం. కాగా, నెలవారీగా చూస్తే మాత్రం ఎనిమిది పారిశ్రామిక రంగాల వృద్ధి రేటు తగ్గింది. జూన్‌లో ఈ రేటు 7.6 శాతం. ఎనిమిది రంగాలూ వేర్వేరుగా... భారీ వృద్ధి... - బొగ్గు: ఉత్పత్తి 0.6 శాతం నుంచి 9.7 శాతానికి ఎగసింది. -

Most from this category