STOCKS

News


పీఎన్‌బీ హౌసింగ్‌లో వాటా విక్రయిస్తాం

Wednesday 11th July 2018
news_main1531327059.png-18212

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలియజేసింది. కార్లైల్‌ గ్రూప్‌తో కలిసి కనీసం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో పీఎన్‌బీకి 32.79 శాతం వాటా, కార్లైల్‌ గ్రూప్‌కు చెందిన క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు 32.36 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 4.8 శాతం వాటాను ఈ ఏడాది మేలో క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా రూ.1,024 కోట్లకు విక్రయించింది. తాజా వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్‌ 3.4 శాతం లాభంతో రూ.1,232 వద్ద ముగిసింది. 
ఐదో పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ...
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అనుబంధ కంపెనీ పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.62,252 కోట్లుగా ఉన్నాయి. ఇది దేశంలోనే ఐదో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.5,517 కోట్ల ఆదాయాన్ని, రూ.829 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ రుణ మంజూరీ 61 శాతం వృద్ధితో రూ.33,195 కోట్లకు పెరిగింది.


.You may be interested

'విస్తార' భారీ విస్తరణ!

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ 'విస్తార'... దేశీ, విదేశీ రూట్లలో కార్యకలాపాలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 19 ఎయిర్‌బస్‌, బోయింగ్ విమానాలకు ఆర్డరు ఇవ్వనుంది. వీటి విలువ 3.1 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 21,344 కోట్లు) ఉండనుంది. అలాగే ఏ320 నియో రకానికి చెందిన మరో 37 విమానాలను లీజుకు తీసుకోనుంది. విస్తార బుధవారం ఒక ప్రకటనలో ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను

ఫారెక్స్‌ సేవల్లోకి పేటీఎం

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ ‘పేటీఎం’ తాజాగా ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ సేవల్లోకి అడుగుపెట్టింది. 20 అంతర్జాతీయ కరెన్సీల్లో మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌, ఫారెక్స్‌ క్యాష్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం కస్టమర్లు ఈ సేవలను సంస్థ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందగలరు. త్వరలోనే పేటీఎం యాప్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి. కేవలం 2 శాతం (ఆర్డర్‌ విలువలో) పాక్షిక చెల్లింపుతో ప్రస్తుత ఎక్స్చేంజ్‌ రేట్లను లాక్‌ చేసుకుని ఆర్డర్‌

Most from this category