STOCKS

News


పారిశ్రామిక దిగ్గజాలతో నేడు ప్రధాని భేటీ

Monday 19th November 2018
news_main1542604349.png-22164

న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు తీసుకోతగిన మరిన్ని చర్యలపై చర్చించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు, విధానకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశం కానున్నారు. టాప్ 50 దేశాల జాబితాలోకి చేందుకు ‍అవసరమైన చర్యలు చర్చించనున్నారు. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం దీన్ని నిర్వహిస్తోంది. ఆనంద్‌ మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గజాలు, సీఐఐ .. ఫిక్కీ .. అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యల ప్రతినిధులతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సం‍స్కరణలను రూపొందించిన సీనియర్ ప్రభుత్వ అధికారులు ఇందులో పాల్గోనున్నారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులున్న దేశాలకు సంబంధించి (ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌) అక్టోబర్‌ 31న ప్రపంచ బ్యాంకు ప్రకటించిన జాబితాలో భారత్ 23 స్థానాలు ఎగబాకి 77వ ర్యాంకుకి చేరిన సంగతి తెలిసిందే.



You may be interested

ప్రభుత్వరంగ సంస్థల షేర్ల బైబ్యాక్‌తో రూ.5,000 కోట్లు

Monday 19th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో కోల్‌ ఇండియా కూడా ఉంది. కోల్‌ ఇండియాలో ఈ నెల మొదట్లో కేంద్రం 3.18 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించడం ద్వారా రూ.5,300 కోట్లు సమీకరించింది. ‘‘ఎనిమిది కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ప్రణాళికలు క్యూలో ఉన్నాయి. వీటితో రూ.5,000 కోట్లు

పేపర్‌లెస్ ఖాతాలకు ఎస్‌బీఐ 'యోనో' నో..

Monday 19th November 2018

న్యూఢిల్లీ: 'యూ ఓన్లీ నీడ్ వన్‌ (యోనో)' యాప్ ద్వారా కాగితరహిత  బ్యాంక్ ఖాతాలను తెరిచే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ నిర్ణయించింది. ఆధార్ వినియోగంపై పరిమితులు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. డిజిటల్ అకౌంట్లను తెరవడానికి ప్రత్యామ్నాయ పరిష్కార సాధనాల వినియోగంపై స్పష్టతనివ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్‌ను కోరినట్లు వివరించారు. బ్యా్ంకింగ్ సేవలు

Most from this category