STOCKS

News


గంటలో రూ.కోటి రుణం

Saturday 3rd November 2018
Markets_main1541230020.png-21679

  • చిన్న సంస్థల రుణావసరాల కోసం ప్రభుత్వ పోర్టల్‌
  • ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు-
  • ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు ఊతమిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ పలు చర్యలు ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈలు కేవలం 59 నిమిషాల వ్యవధిలోనే రూ. 1 కోటి దాకా రుణాలు పొందగలిగేలా ప్రత్యేక పోర్టల్‌ను (www.psbloanin59minutes.com) శుక్రవారం ఆవిష్కరించారు. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ)లో నమోదు చేయించుకున్న ఎంఎస్‌ఎంఈలు ఈ ప్రయోజనాలు పొందవచ్చని మోదీ చెప్పారు. నిబంధనలను అనుసరించి 2 శాతం దాకా వడ్డీ రాయితీ పొందవచ్చన్నారు. ఎంఎస్‌ఎ౾౾౾ంఈలు చేసే ఎగుమతులకు ముందస్తుగాను, ఆ తర్వాత ఇచ్చే వడ్డీ రాయితీని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు మోదీ తెలిపారు. మొత్తం మీద ఎంఎ౾స్‌ఎంఈలకు ఊతమిచ్చేలా 12 చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం రూ. 5 కోట్ల దాకా ఆదాయాలు ఉన్న సంస్థలను లఘు సంస్థలుగాను, రూ. 5-75 కోట్ల దాకా ఆదాయాలున్న వాటిని చిన్న సంస్థలుగా, అంతకు మించి రూ. 250 కోట్ల దాకా ఆదాయం ఉన్నవి మధ్య స్థాయి సంస్థలుగాను పరిగణిస్తున్నారు.

ఈజ్‌ ఆఫ్ బిజినెస్‌లో దూకుడు..
వ్యాపారాలకు అనువైన విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ ఏకంగా 23 స్థానాలు ఎగబాకడంపై మోదీ స్పందించారు. తమ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఎవరూ ఊహించని విజయాలను సాధించిందని చెప్పారు. ఏ దేశం కూడా ఈ స్థాయిలో స్థానాలను మెరుగుపర్చుకోలేదన్నారు. ప్రపంచ బ్యాంకు రూపొందించిన "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌" దేశాల జాబితాలో 2014లో 142వ ర్యాంకులో ఉన్న భారత్ ప్రస్తుతం 77వ ర్యాంకుకు చేరింది. త్వరలోనే టాప్ 50వ ర్యాంకును చేరుకోగలమని మోదీ పేర్కొన్నారు. సంస్కరణల ప్రక్రియతో చిన్న, మధ్య తరహా సంస్థలకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు.



You may be interested

రూపాయికి ఫుల్‌ జోష్‌

Saturday 3rd November 2018

ఒక్క రోజులోనే 100 పైసలు బలోపేతం డాలర్‌తో 72.45కు చేరిక ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కుమ్మేసింది. శుక్రవారం ఒకే రోజు డాలర్‌తో 100 పైసలు బలపడి 72.45కు వచ్చేసింది. గడిచిన ఐదేళ్లలో (2013 సెప్టెంబర్‌ తర్వాత) రూపాయి ఒకే రోజు ఇంతగా లాభపడిన సందర్భం ఇదే. చమురు ధరలు శాంతించడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌కు అమెరికా మినహాయింపునిచ్చే అవకాశాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాక రూపాయిని

పసిడి 4వారాల ర్యాలీకి బ్రేక్‌..!

Saturday 3rd November 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. ఈ ఆక్టోబర్‌ నెల ఉద్యోగ గణాంకాలను అమెరికా వెల్లడించింది. మార్కెట్‌ వర్గాల అంచనాలను మించి ఆర్థికవ్యవస్థలో నూతనంగా 2.5లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. అధిక ఉద్యోగకల్పనతో రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెరుగుతాయి. తద్వారా ట్రెజరరీ ఈల్డ్‌తో పాటు డాలర్‌ విలువ కూడా పెరుగుతుంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 96.59స్థాయిని తాకింది. మరోవైపు చైనాతో నెలకొన్న వాణిజ్య

Most from this category