STOCKS

News


నిస్సాన్‌లో నియామకాలు

Friday 7th September 2018
news_main1536295496.png-20032

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)పై వ్యయం పెంచుతున్నట్లు జపనీస్‌ ఆటో దిగ్గజం నిస్సాన్‌ వెల్లడించింది. భారత్‌లోని తమ చెన్నై ప్లాంట్‌ను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు  సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) ఏర్పాటుచేసిన సమావేశంలో తెలిపింది. ఈ సందర్భంగా నిస్సాన్‌ ఇండియా, ఆఫ్రికా, మధ్యతూర్పు ప్రాంతాల చైర్మన్‌ పెయమన్‌ కార్గర్‌ మాట్లాడుతూ.. ‘మూవ్‌ 2022’ పేరిట రూపొందించిన వ్యూహం ప్రకారం, సౌదీ అరేబియాతో పాటు వ్యాపార కార్యకలాపాలను భారత్‌ నుంచీ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఆర్‌ అండ్‌ డీని మరింత బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. ‘ప్రస్తుతం చెన్నై పరిశోధనా విభాగంలో 7,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాదిలో నూతనంగా మరో 1,000 మందిని భారత్‌ పరిశోధనా విభాగంలో నియమించనున్నాము. ఇదే సమయంలో డిజిటల్‌ హబ్‌లో 500 మందిని నియమిస్తున్నాం. వ్యయ నియంత్రణలో భాగంగా టెక్నాలజీని వినియోగించుకుని, తయారీ విభాగంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నాం.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

అత్యంత విలువైన బ్రాండ్‌గా మరోసారి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

Friday 7th September 2018

ముంబై: దేశంలో అత్యంత విలువైన టాప్‌ బ్రాండ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరోసారి గుర్తింపు దక్కించుకుంది. బ్రాండ్జ్‌ ఇండియా టాప్‌ 50లో మొదటి స్థానాన్ని వరుసగా ఐదో ఏడాది సొంతం చేసుకుంది. ‘డబ్ల్యూపీపీ అండ్‌ కంతర్‌ మిల్‌వర్డ్‌ బ్రౌన్స్‌’ బ్రాండ్జ్‌ నివేదిక ప్రకారం... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్‌ విలువ 21 శాతం వృద్ధి చెంది 2018లో 21.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. బ్యాంకు శాఖల ద్వారా 175 డాలర్ల చిన్న రుణాలను

ఫ్లాట్‌గా రూపాయి

Friday 7th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. అయితే వెంటనే ఆ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.99 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు స్థాయి 71.99గా ఉంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం 71.92 వద్ద ప్రారంభమైంది. 72.04 స్థాయిని కూడా తాకింది. కాగా రూపాయి గురువారం ఇంట్రాడేలో

Most from this category