News


బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీగా పుర్వార్‌?

Wednesday 30th January 2019
Markets_main1548822713.png-23888

  • ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి సిఫారసు

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) పదవికి ఎంటీఎన్‌ఎల్‌ సీఎండీ ప్రవీణ్‌ కుమార్‌ పుర్వార్‌ పేరును ప్రభుత్వరంగ సంస్థల నియామక బోర్డు సిఫారసు చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుత సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ పదవీకాలం జూన్‌తో ముగియనుంది. ఏడాదిన్నర క్రితం శ్రీవాస్తవ బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టగా, తన పదవీకాలంలో సంస్థ కార్యకలాపాలను గాడిలో పెట్టే చర్యలను అమలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.672 కోట్ల మేర నిర్వహణ లాభాన్ని నమోదు చేసింది. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేకపోయినప్పటికీ తన కస్టమర్ల సంఖ్యను పెంచుకుంది. 2017-18 సంవత్సరంలో కొత్త చందాదారులను చేర్చుకునే విషయంలో సంస్థ పనితీరు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాల కంటే ముందుండడం గమనార్హం. ఇక పుర్వార్‌ ఎంటీఎన్‌ఎల్‌ సీఎండీ బాధ్యతలను 2017 మార్చిలో చేపట్టారు. ఎంటీఎన్‌ఎల్‌ పనరుద్ధరణకు సంబంధించి ఆయన ప్రతిపాదించిన ప్రణాళికకు ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలియజేయాల్సి ఉంది. ఎంటీఎన్‌ఎల్‌కు సంబంధించి రూ.19,300 కోట్ల విలువైన భూములు, ఇతర ఆస్తులను ప్రభుత్వం తీసేసుకుని, సంస్థ రూ.19,000 కోట్ల రుణ భారాన్ని తీర్చేయాలని కోరింది.You may be interested

యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్ల సయోధ్య

Wednesday 30th January 2019

-చెరొక డైరెక్టర్‌ను నియమించడానికి అంగీకారం న్యూఢిల్లీ: యస్‌బ్యాంక్‌ ప్రమోటర్లు-రాణా కపూర్‌, మధు కపూర్‌ల మధ్య సయోధ్య కుదిరింది. ఈ సయోధ్యలో భాగంగా ఇరువురు ప్రమోటర్లు చెరో డైరెక్టర్‌ను నియమించడానికి అంగీకరించారు. తదుపరి బోర్డ్‌ సమావేశం జరిగే ఏప్రిల్‌ నెలలో ఈ డైరెక్టర్ల పేర్లను ప్రకటిస్తారని యస్‌బ్యాంక్‌ తెలిపింది. కాగా ఈ నెల 31తో ఎమ్‌డీ, సీఈఓగా రాణా కపూర్‌ పదవీ కాలం ముగుస్తోంది. రాణా కపూర్‌ వారసుడిగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌

ఆల్‌టైం హైకి యాక్సిస్‌ బ్యాంక్‌

Wednesday 30th January 2019

ప్రైవేట్‌రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు షేరు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఆల్‌టైం గరిష్టాన్ని అందుకుంది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు బీఎస్‌ఈలో షేరు గతముగింపు(రూ.660.8)తో 4శాతం లాభంతో రూ.687.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 6.50శాతం ర్యాలీ చేసి రూ.703.00వద్ద ఆల్‌టైం హైకి

Most from this category