STOCKS

News


చిన్న సంస్థలకు ఊతం

Saturday 2nd February 2019
news_main1549096474.png-23960

  • నిమిషాల్లోనే రుణాలు
  • ఎస్‌ఎంఈల నుంచే 25 శాతం కొనుగోళ్లు

న్యూఢిల్లీ: కోట్లాది మందికి ఉపాధి కల్పించే లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) తోడ్పాటునిచ్చేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఇటీవలే 59 నిమిషాల్లోనే రూ. 1 కోటి దాకా రుణాల పథకాన్ని ప్రారంభించామని, జీఎస్‌టీలో నమోదు చేసుకున్న ఎస్‌ఎంఈలకు రూ. 1 కోటిపైగా రుణాలపై రెండు శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక రూ. 5 కోట్ల కన్నా తక్కువ వార్షిక టర్నోవరు ఉన్న 90 శాతం మంది జీఎస్‌టీ చెల్లింపుదారులు ఇకపై మూణ్నెల్లకోసారి రిటర్నులు దాఖలు చేసేలా నిబంధనలు సడలిస్తున్నామన్నారు. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇక నుంచి 25 శాతం కొనుగోళ్లు ఎస్‌ఎంఈల నుంచే జరపాల్సి ఉంటుందని, ఇందులోనూ 3 శాతం కొనుగోళ్లు మహిళల సారథ్యంలోని సంస్థల నుంచి కొనాల్సి ఉంటుందని గోయల్ చెప్పారు.

జీఈఎం పోర్టల్‌ ద్వారా రూ. 17వేల కోట్ల లావాదేవీలు..
ప్రభుత్వ శాఖలు, సంస్థల ఆన్‌లైన్ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా గడిచిన రెండేళ్లలో రూ. 17,500 కోట్ల పైచిలుకు లావాదేవీలు జరిగాయని గోయల్ చెప్పారు. వీటితో 25-28 శాతం మేర ఆదా అయ్యిందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ పోర్టల్‌లో 1,90,226 మంది విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు 7,53,162 పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ముద్ర స్కీమ్ కింద రూ. 7 లక్షల కోట్ల రుణాలు..
ముద్ర స్కీమ్‌ను ప్రవేశపెట్టినప్పట్నుంచీ రూ. 7.23 లక్షల కోట్ల విలువ చేసే 15.56 లక్షల రుణాలు మంజూరైనట్లు గోయల్ చెప్పారు. లబ్ధిదారుల్లో మహిళల సంఖ్య 70 శాతం పైగానే ఉందని ఆయన పేర్కొన్నారు.



You may be interested

ద్రవ్యబాటలో ఒడిదుడుకులు

Saturday 2nd February 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు కట్టుతప్పనున్న విషయం స్పష్టమైపోయింది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3.4 శాతంగా ఉండే అవకాశం ఉందని స్వయంగా ఆర్థికమంత్రే సూచించడం గమనార్హం. 2018-19  ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్‌ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. అయితే 2018 నవంబర్‌ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే

ఎగుమతులకు మరింత జోష్‌

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: ఎగుమతులను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో వాటికి సంబంధించిన పథకాలకు కేటాయింపులు మరింతగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2019-20లో ఎగుమతి ప్రోత్సాహక స్కీములకు రూ. 4,115 కోట్ల మేర కేటాయింపులను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 2018-19లో ముందుగా రూ. 3,551 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత సవరించిన గణాంకాల ప్రకారం ఇది రూ. 3,681 కోట్లకు పెరిగింది. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌లో పెట్టుబడులు, జాతీయ ఎగుమతి బీమా ఖాతా, వడ్డీ

Most from this category