News


వచ్చే నెల్లో పిటా పిట్‌ రెస్టారెంట్‌

Tuesday 6th November 2018
news_main1541481570.png-21747

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కెనడాకు చెందిన రెస్టారెంట్‌ చెయిన్‌, పిటా పిట్‌ వచ్చే నెల్లో హైదరాబాద్‌లో తొలి రెస్టారెంట్‌ను ప్రారంభిస్తోంది.  తమకు దక్షిణ భారత దేశంలో ఇదే తొలి రెస్టారెంట్‌ కానున్నదని పిటా పిట్‌ ఇండియా సీఈఓ విరాట్‌ మోహన్‌ విలేకరులకు తెలియజేశారు. ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన పిటా శాండ్‌విచ్‌లను అందిస్తామని, ఇవి అధిక కొవ్వుతో కూడిన ఫాస్ట్‌ ఫుడ్‌కు మంచి ప్రత్యామ్నాయమని  పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో 11 రెస్టారెంట్లను భాగస్వామ్య పద్ధతిలో అందుబాటులోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని చెప్పారాయన. ఈ బ్రాండ్‌కు దక్షిణ, పశ్చిమ భారతంలో మ్యువీ కాన్సెప్ట్‌ రెస్టారెంట్స్‌ సంస్థ మాస్టర్‌ ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నట్లు మ్యువి ఎమ్‌డీ రాశీ అగర్వాల్‌ చెప్పారు. మూడేళ్లలో 10 ప్రధాన నగరాల్లో 50 రెస్టారెంట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. 1995లో కెనడాలో ఆరంభమైన పిటా పిట్‌,... ప్రస్తుతం 13 దేశాల్లో 650 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది.



You may be interested

తెలుగు రాష్ట్రాల్లో మరో 30 నెఫ్రోప్లస్‌ కేంద్రాలు

Tuesday 6th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోని అతిపెద్ద డయాలసిస్‌ కేర్‌ నెట్‌వర్క్‌ నెఫ్రోప్లస్‌... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరణ చేపట్టింది. వచ్చే ఏడాది కాలంలో రూ.75 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ కొత్తగా 30 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యించింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 40 సెంటర్లున్నాయి. ఫిబ్రవరి నాటికి ఏపీలో కొత్తగా 3 సెంటర్లను ప్రారంభించనున్నట్లు నెఫ్రోప్లస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ విక్రమ్‌ ఉప్పాల ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.

జేవీల్లో వాటా విక్రయిస్తాం; ఆంధ్రా బ్యాంక్‌

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ:  వివిధ జాయింట్‌ వెంచర్లలో ఉన్న  వాటాలను పూర్తిగా కానీ, పాక్షికంగా గానీ విక్రయించనున్నామని  ఆంధ్రా బ్యాంక్‌ తెలిపింది. ఈ మేరకు ఇటీవల జరిగిన తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఆస్‌రెక్‌ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌(మలేషియా) బెర్హాద్‌, ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. జేవీల్లో వాటాలను విక్రయిస్తామని వివరించింది. 

Most from this category