STOCKS

News


‘కేటీఎమ్‌’లో వాటా విక్రయించనున్న బజాజ్‌ ఆటో

Friday 22nd March 2019
news_main1553238972.png-24751

జూన్‌ కల్లా లావాదేవీ పూర్తి ! 
న్యూఢిల్లీ: ఆస్ట్రియా మోటార్‌ సైకిల్‌ కంపెనీ, కేటీఎమ్‌ ఏజీలో బజాజ్‌ ఆటోకు ఉన్న 48 శాతం వాటా చేతులు మారనున్నది. ఈ వాటాను కేటీఎమ్‌ ఏజీ మాతృ కంపెనీ, కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌లో అధిక (62 శాతం)వాటా ఉన్న పియరర్‌ ఇండస్ట్రీ ఏజీకి బజాజ్‌ ఆటో విక్రయించనున్నది. ఈ మేరకు పియరర్‌ ఇండస్ట్రీ ఏజీకి, బజాజ్‌ ఆటో కంపెనీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన లావాదేవీ ఈ ఏడాది జూన్‌కల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయని బజాజ్‌ ఆటో తెలిపింది. ప్రస్తుతం కేటీఎమ్‌ ఏజీలో కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌కు 51.7 శాతం, బజాజ్‌ ఆటోకు 48 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ 48 శాతం వాటాను బజాజ్‌ ఆటో కంపెనీ కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌ ఏజీకి బదిలీ చేస్తుంది. ఈ వాటాకు సమానమైన కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను బజాజ్‌ ఆటోకు కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌ కేటాయిస్తుంది. ఈ లావాదేవీ కారణంగా కేటీఎమ్‌ ఏజీలో కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌ వాటా 99.7 శాతానికి పెరుగుతుంది. మరోవైపు బజాజ్‌ ఆటోకు కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌లో 22 శాతం వాటా లభిస్తుందని అంచనా.
అతి పెద్ద యూరప్‌ బైక్‌ కంపెనీ 
‘కేటీఎమ్‌’, ‘హస్‌క్యూవర్న’ బ్రాండ్‌ బైక్‌లను కేటీఎమ్‌ ఏజీ కంపెనీ తయారు చేసి విక్రయిస్తోంది. ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌, ఆస్ట్రేలియా, అర్జెంటీనా తదితర దేశాల్లో ఈ బైక్‌లకు మంచి మార్కెట్‌ ఉంది. యూరప్‌లో అతి పెద్ద మోటార్‌ బైక్‌ కంపెనీ తమదేనని కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌ అంటోంది. కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌కు వచ్చే ఆదాయంలో అధిక బాగం కేటీఎమ్‌ ఏజీ నుంచే వస్తోంది. 2007లో బజాజ్‌ఆటో కంపెనీ కేటీఎమ్‌ ఏజీలో 48 శాతం వాటాను రూ.1,219 కోట్లకు కొనుగోలు చేసింది.



You may be interested

భారత్‌ జీడీపీ అంచనాలను తగ్గించిన ఫిచ్‌

Friday 22nd March 2019

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇండియా జీడీపీ వృద్ది రేటు అంచనాను ఫిచ్‌ రేటింగ్స్‌ 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఎకానమీలో అనుకున్నదానికన్నా ఎక్కువ బలహీనత కనిపించవచ్చని అందుకే వృద్ధి అంచనా తగ్గిస్తున్నామని తెలిపింది. అయితే అంచనా తగ్గించినా, 6.8 శాతం వృద్ది రేటు ఆమోదయోగ్యమేనని తెలిపింది. ఆపై ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7. 1 శాతంగా నమోదు కావచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు

ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య ఇండిగో సర్వీస్‌

Friday 22nd March 2019

- 222 సీట్లతో ఏ321నియో విమానం ఇస్తాంబుల్: చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో.. ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య నూతన సర్వీసును ప్రారంభించింది. టర్కీలోని ఈ నగరానికి 222 సీట్లు కలిగిన ఏ321నియో విమానాన్ని కేటాయించింది. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ చేరుకోవడానికి సాధారణంగా ఏడు గంటల సమయం పట్టనుండగా.. పాకిస్తాన్‌ ఎయిర్‌స్పేస్‌ మూసివేసిన కారణంగా ప్రస్తుతానికి పదకొండు గంటల సమయం పడుతుందని సంస్థ ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ తెలిపారు.

Most from this category