STOCKS

News


పోటీ సంస్థలపై ఫోన్‌పే విమర్శల దాడి

Thursday 13th September 2018
news_main1536814946.png-20231

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన చెల్లింపుల సంస్థ ఫోన్‌పే... ప్రత్యర్థి కంపెనీలపై విమర్శలకు దిగింది. డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్స్‌ను భారత పన్ను చట్టం కిందకు తీసుకువచ్చే ఆర్‌బీఐ డేటా లోకలైజేషన్‌ను అవి వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించింది. డేటాను తప్పనిసరిగా స్థానికంగానే స్టోర్‌ చేయాలన్న ఆర్‌బీఐ నిబంధన వల్ల... యూజర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని సెర్చ్‌, మ్యాప్స్‌, షోషల్‌ మీడియా సేవలను ఆఫర్‌చేసే గూగుల్‌, ఫేస్‌బుక్‌ నుంచి భారత యూజర్ల పేమెంట్‌ డేటాకు రక్షణ లభిస్తుందని ఫోన్‌పే తన బ్లాగులో పేర్కొంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే చెల్లింపుల సేవల సంస్థలన్నీ... యూజర్ల లావాదేవీల సమాచారాన్ని భారత సరిహద్దుల పరిధిలోనే స్టోర్‌ చేయాలని ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది. దీనికి అక్టోబర్‌ 15 వరకు గడువిచ్చింది. గూగుల్‌ పే (గూగుల్‌), మాస్టర్‌ కార్డ్‌, వీసా, అమెజాన్‌ పే, వాట్సాప్‌ (ఫేస్‌బుక్‌) సంస్థలు భారత్‌లో చెల్లింపుల సేవల్లో ఉన్నాయి. వాట్సాప్‌ చెల్లింపుల సేవల్ని ఇప్పటికే పరీక్షించింది. చెల్లింపుల డేటా స్థానికంగానే నిల్వ చేయడం వల్ల నియంత్రణ పరంగా మరింత పర్యవేక్షణ సాధ్యపడుతుందని ఫోన్‌పే అభిప్రాయపడింది. లోపాలను అసరాగా చేసుకుని పన్ను ఎగవేసే చర్యలకు చెక్‌ పడుతుందని కూడా పేర్కొంది. కాగా, ఆర్‌బీఐ నిబంధనను పాటించేందుకు గూగుల్‌ ఇప్పటికే అంగీకరించగా, గడువును మాత్రం డిసెంబర్‌ వరకు పొడిగించాలని కోరింది. అయితే, గూగుల్‌ భారత యూజర్లకు సంబంధించిన అన్ని చెల్లింపుల డేటాను స్థానికంగానే నిల్వ చేస్తుందా అన్న దానిపై తన విధానాన్ని మరింత స్పష్టం చేయాల్సి ఉందని ఫోన్‌పే డిమాండ్‌ చేసింది. 



You may be interested

ఈ నెల 24 నుంచి గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీఓ

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: కోల్‌కతా కేంద్రంగా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఈ నెల 24న మొదలై 26న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.340 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు ధరల శ్రేణిగా రూ.115-118ను కంపెనీ నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌పై రూ.5 డిస్కౌంట్‌ లభిస్తుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 120

రూపాయి రికవరీ..

Thursday 13th September 2018

ముంబై: ప్రతి రోజూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతున్న రూపాయి బుధవారం కొంత కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ 51 పైసలు బలపడి 72.18 వద్ద ముగిసింది. రూపాయి మరీ అసంబద్ధ స్థాయికి పడిపోకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ భరోసా కల్పించడం దీనికి తోడ్పడింది. మొదట్లో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం కూడా 72.91 స్థాయికి పడిపోయి కొత్త కనిష్టాన్ని నమోదు

Most from this category