STOCKS

News


ఫార్మా ఎగుమతులు 11% అప్

Wednesday 24th April 2019
news_main1556079221.png-25306

- 2018-19లో 19.2 బిలియన్ డాలర్లకు
- చైనాలో పెరుగుతున్న అవకాశాలు

న్యూఢిల్లీ: ఉత్తర అమెరికా, యూరప్‌ దేశాల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత ఫార్మా రంగ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం 11 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. 2018-19లో 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 17.3 బిలియన్ డాలర్లు కాగా, 2016-17లో 16.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ఫార్మా ఎగుమతుల్లో ఉత్తర అమెరికా మార్కెట్ వాటా 30 శాతంగా ఉండగా, ఆఫ్రికా వాటా 19 శాతం, యూరోపియన్ యూనియన్ వాటా 16 శాతంగాను ఉంది. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చైనా మార్కెట్ కూడా క్రమంగా అందుబాటులోకి వస్తోందని, వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా చైనాకు ఫార్మా ఎగుమతులపై మరింతగా దృష్టి సారిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇతరత్రా కీలకమైన దక్షిణాఫ్రికా, రష్యా, నైజీరియా, బ్రెజిల్‌, జర్మనీలకు కూడా ఎగుమతులు వృద్ధి చెందాయి. 

టాప్ 5లో ఒకటి...
ఎగుమతులకు సంబంధించిన టాప్ 5 రంగాల్లో ఫార్మా కూడా ఒకటి. 2018-19లో మొత్తం 331 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో ఫార్మా వాటా 6 శాతంగా నమోదైంది. దేశీ ఫార్మా రంగంలో జనరిక్స్ ఔషధాల వాటానే ఎక్కువగా ఉంటోంది. ఆదాయాలపరంగా వీటి మార్కెట్ వాటా 75 శాతం పైగా ఉంది. పరిమాణంపరంగా అంతర్జాతీయంగా 20 శాతం జనరిక్ ఔషధాలను భారత్ సరఫరా చేస్తోంది. 55 శాతం పైగా భారత ఫార్మా ఎగుమతులు.. అత్యధిక నియంత్రణలు ఉండే దేశాలకు ఉంటున్నాయి. 



You may be interested

జెట్ పునరుద్ధరణపై ఆశలు

Wednesday 24th April 2019

- మెజారిటీ వాటాల కొనుగోలుపై  బ్రిటన్ వ్యాపారవేత్త జేసన్‌ ఆసక్తి - సంస్థ సీఈవోకి వినయ్‌ దూబేకు లేఖ న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిల్చిపోయిన జెట్ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణపై ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తూ తాజాగా బ్రిటన్ వ్యాపారవేత్త జేసన్ అన్స్‌వర్త్‌.. కంపెనీలో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మెజారిటీ వాటాల కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ జెట్ సీఈవో వినయ్ దూబేకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన దూబే .. ఇతర

ఇరాన్‌ చమురు దిగుమతులకు ముగింపు!

Wednesday 24th April 2019

- 2-3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం - విలువ మదింపు ప్రక్రియలో సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్ ఫండ్‌ - జియో విలువ 50 బిలియన్ డాలర్లుగా జేపీ మోర్గాన్ అంచనాలు న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు 2–3 బిలియన్‌ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. వాటాల విక్రయం ద్వారా వ్యాపార సామ్రాజ్య రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్‌

Most from this category