STOCKS

News


ఆర్‌ఈసీ మైనారిటీ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ లేనట్టే

Monday 10th December 2018
news_main1544417390.png-22790

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మరో ప్రభుత్వరంగ కంపెనీ ఆర్‌ఈసీని కొనుగోలు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ అనుమతించిన నేపథ్యంలో... ఆర్‌ఈసీ మైనారిటీ వాటాదారులకు పీఎఫ్‌సీ ఎటువంటి ఓపెన్‌ ఆఫర్‌ చేయదని ఓ సీనియర్‌ అధికారి స్పష్టం చేశారు. ఆర్‌ఈసీలో కేంద్ర ప్రభుత్వానికి 52.63 శాతం వాటా ఉంది. ఈ వాటాను పీఎఫ్‌సీ కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.10,500 కోట్లు సమకూరనున్నాయి. కొనుగోలు తర్వాత పీఎఫ్‌సీ అనుబంధ సంస్థగా ఆర్‌ఈసీ లిస్టెడ్‌ కంపెనీగానే కొనసాగుతుందని సంబంధిత అధికారి తెలిపారు. ‘‘యాజమాన్యం ఏమీ మారడం లేదు కనుక ఓపెన్‌ ఆఫర్‌ అవసరం లేదని భావిస్తున్నాం. ఇది పార్టీ లావాదేవీ మాత్రమే. సెబీ నుంచి మినహాయింపు కోరతాం’’ అని చెప్పారు. ఆర్‌ఈసీకి ఎంత మేర ప్రీమియం చెల్లించాలన్నది జనవరిలో నిర్ణయం అవుతుందన్నారు. సెబీ నిబంధనల ప్రకారం ఓ కంపెనీలో 25 శాతానికిపైగా వాటాను మరో కంపెనీ కొనుగోలు చేస్తే, మైనారిటీ వాటాదారుల నుంచి కనీసం 26 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 



You may be interested

స్టార్టప్‌ లిస్టింగ్ నిబంధనలు సడలించడంపై సెబీ దృష్టి

Monday 10th December 2018

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో స్టార్టప్‌ల లిస్టింగ్‌ను ప్రోత్సహించే క్రమంలో నిబంధనలను సరళతరం చేయడంపై  మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ-కామర్స్‌, డేటా అనలిటిక్స్‌, బయోటెక్నాలజీ తదితర రంగాల స్టార్టప్‌ల నిధుల సమీకరణకు తోడ్పడే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. వీటిని ఈ వారంలో జరిగే బోర్డు సమావేశంలో సెబీ చర్చించనుంది. అలాగే, ఈ తరహా సంస్థల లిస్టింగ్‌ కోసం ఉద్దేశించిన 'ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం' పేరును 'ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్‌ఫాం'గా మార్చే

మార్కెట్లకు ఎన్నికల ఫలితాల దిశానిర్దేశం

Monday 10th December 2018

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రూడాయిల్ రేట్లతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. రాజకీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్స్చేంజీలు నిఘా చర్యలను మరింత పటిష్టంగా

Most from this category