STOCKS

News


పీఎఫ్‌సీ లాభం రూ.1,373 కోట్లు

Wednesday 12th September 2018
news_main1536729463.png-20184

న్యూఢిల్లీ: పవర్‌ ఫైనాన్స్‌ కంపెనీ (పీఎఫ్‌సీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,373 కోట్ల నికర లాభం (స్టాండ్‌ అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.1,122 కోట్లతో పోలిస్తే 22 శాతం వృద్ధి సాధించామని పీఎఫ్‌సీ తెలిపింది. గత క్యూ1లో రూ.6,729 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.7,028 కోట్లకు పెరిగింది. పన్ను వ్యయాలు రూ.313 కోట్ల నుంచి రెట్టింపై రూ.668 కోట్లకు ఎగిశాయి. ఈ క్యూ1లో వడ్డీ వ్యయాలు రూ.4,941 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. విద్యుత్తు రంగానికి రుణాలనందించడం ఈ కంపెనీ ప్రధాన వ్యాపారం. ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్‌ఈలో పీఎఫ్‌సీ షేరు ధర 8 శాతం నష్టపోయి రూ.81 వద్ద ముగిసింది.


 


PFC

You may be interested

ఈ నెల 18 నుంచి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్ల బైబ్యాక్‌

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  ఈ  నెల 18 నుంచి షేర్ల బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. వచ్చే నెల 3న ముగిసే ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా ఒక్కో షేర్‌ను రూ.1,100కు కొనుగోలు చేస్తారు. మొత్తం 3.64 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.4,000 కోట్లని సంస్థ తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు గతనెలలోనే వాటాదారులు ఆమోదం తెలిపారు. నికర లాభంలో సగానికి

ప్రభుత్వ విధానాలే కంపెనీలకు పెద్ద రిస్కు..

Wednesday 12th September 2018

ముంబై: రాబోయే మూడేళ్లలో కార్పొరేట్లు ఎదుర్కొనబోయే అతి పెద్ద రిస్కుల్లో ప్రభుత్వ విధానాలే ప్రధమ స్థానంలో ఉంఽడనున్నాయి. నియంత్రణ సంస్థల నిబంధనలను పాటించడం చాలా కీలకంగా మారినట్లు పలువురు చీఫ్ ఆఫీసర్స్ (సీఎక్స్‌వో) భావిస్తుండటమే ఇందుకు కారణం. కంపెనీలకు ఎదురయ్యే రిస్కుల్లో.. సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీపరమైనవి తరువాతి స్థానాల్లో ఉండనున్నాయి. డెలాయిట్ ఇండియా నిర్వహించిన రిస్క్ సర్వే 2018లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 44 శాతం సంస్థలు భవిష్యత్ అవకాశాలు,

Most from this category