STOCKS

News


నెల రోజుల్లో 5 మొండిపద్దుల పరిష్కారం

Thursday 13th September 2018
news_main1536813611.png-20217

న్యూఢిల్లీ: సుమారు రూ.8,254 కోట్ల మేర రుణాలు పొందిన అయిదు మొండి పద్దుల సమస్య నెలరోజుల్లో ఒక కొలిక్కి రావొచ్చని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్ శర్మ అంచనా వేశారు. ఈ లోగా వీటి  పరిష్కార ప్రక్రియ అమలు చేసే అవకాశాలున్నాయని చెప్పారాయన. జీఎంఆర్ చత్తీస్‌గఢ్, జబువా పవర్‌, కేఎస్‌కే మహానది పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్లతో చర్చలు దాదాపు తుది దశలో ఉన్నాయని రాజీవ్ శర్మ వెల్లడించారు. అలాగే ఇండియాబుల్స్‌ అమరావతి, ఎస్సార్ మహాన్ ప్రాజెక్టుల యాజమాన్యాలు వన్‌ టైమ్ సెటిల్‌మెంట్‌కు ముందుకొచ్చాయని, వీటిపై కూడా చర్చలు తుదిదశలో ఉన్నాయని తెలియజేశారు. అటు ఇండియాబుల్స్ నాసిక్‌, ఆర్‌కేఎం పవర్‌జెన్‌ ప్రాజెక్టుల పరిష్కారంపై కూడా పురోగతి సాధించినట్లు శర్మ తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు పీఎఫ్‌సీ దాదాపు రూ.8,156 కోట్ల మేర రుణాలిచ్చింది. రూ.2,000 కోట్లు దాటిన బడా మొండిపద్దులు సెప్టెంబర్‌ 11లోగా పరిష్కారం కాకపోతే, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాలన్న రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌పై సుప్రీం కోర్టు స్టే విధించడం తమ సంస్థకు ప్రయోజనకరమేనని శర్మ వివరించారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కార ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



You may be interested

జీఎస్టీ ఎగవేతలపై ఇక ముమ్మర చర్యలు

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతలను నిరోధించేందుకు సోదాలు, స్వాధీనాలతో పాటు అరెస్ట్‌లు తదితర అంశాలను చూసేందుకు జీఎస్టీ కమిషనర్‌ (ఇన్వెస్టిగేషన్‌) కార్యాలయాన్ని కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. తొలి కమిషనర్‌గా నీరజ్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. వ్యాపారులు కొత్త పన్ను చట్టానికి మళ్లేందుకు, అలవాటు పడేందుకు కొంత కాలం చూసీ, చూడనట్టు వ్యవహరించిన కేంద్రం ఇప్పుడు తీవ్ర చర్యలకు రంగం సిద్ధం చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది దాటిపోవడం, పన్ను

టియాగో ఎన్ఆర్‌జీ @ రూ.5.49 లక్షలు

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: టియాగో హచ్‌బ్యాక్‌ అధునాతన వెర్షన్‌ను టాటా మోటార్స్ బుధవారం విడుదలచేసింది. ‘టియాగో ఎన్ఆర్‌జీ’ పేరిట విడుదలైన ఈ ఎస్‌యూవీలో మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, ట్యూన్డ్ సస్పెన్షన్ వంటి ఫ్యూచర్లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండడంతో భద్రతా వ్యవస్థ మునుపటి వెర్షన్ల కంటే ఎక్కువని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎండీ గుంటెర్ బుషెక్‌ వివరించారు. 5-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన ఎన్ఆర్‌జీని ‘అర్బన్ టఫ్‌రోడ్డర్‌’గా

Most from this category