STOCKS

News


పెన్నార్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Friday 17th May 2019
news_main1558077008.png-25796

హైదరాబాద్‌: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో పెన్నార్‌అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించింది. పెన్నార్‌ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌(పెబ్స్‌), పెన్నార్‌ ఎన్విరో లిమిటెడ్‌లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో విలీనమవుతాయి. విలీన స్కీమ్‌ ప్రకారం, ప్రతి 13 పెబ్స్‌ షేర్లకు 23 పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్‌ ఎన్విరో షేర్‌కు ఒక పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ లభిస్తుంది. విలీన స్కీమ్‌కు అప్పాయింటెడ్‌ డేట్‌ను గత ఏడాది ఏప్రిల్‌ 1గా ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. వాటాదారులకు కొత్త షేర్లు రావడానికి 2-3 నెలల సమయం పడుతుందని అంచనా.  విలీనం కారణంగా వ్యయాలు కలసివస్తాయని, నిధుల వినియోగం మెరుగుపడుతుందని కంపెనీ వైస్‌-ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ స్ట్రాటజీ) కె.ఎమ్‌. సునీల్‌ పేర్కొన్నారు. త్వరలో రికార్డ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. 



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Friday 17th May 2019

పెన్నార్‌  విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం హైదరాబాద్‌: పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో పెన్నార్‌అనుబంధ కంపెనీల విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించింది. పెన్నార్‌ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌(పెబ్స్‌), పెన్నార్‌ ఎన్విరో లిమిటెడ్‌లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌లో విలీనమవుతాయి. విలీన స్కీమ్‌ ప్రకారం, ప్రతి 13 పెబ్స్‌ షేర్లకు 23 పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లభిస్తాయి. అలాగే ప్రతి ఒక్క పెన్నార్‌ ఎన్విరో షేర్‌కు ఒక పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ లభిస్తుంది. విలీన స్కీమ్‌కు

ఒక్క త్రైమాసికంలో 52వేల కోట్లు!!

Friday 17th May 2019

 ఈ క్యూ4లో ప్రభుత్వ బ్యాంకుల కేటాయింపులివీ... లాభాలను పూర్తిగా హరిస్తున్న మొండి బాకీలు మరికొన్ని క్వార్టర్ల పాటు ఇదే వరుస: విశ్లేషకులు ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు అంతకంతకూ పేరుకుపోతుండటంతో వాటికి బ్యాంక్‌లు అధికంగా కేటాయింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి త్రైమాసికానికీ బ్యాంక్‌ల లాభదాయకత అంతకంతకూ క్షీణిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎన్‌పీఏలకు జరిపిన కేటాయింపులతో పోలిస్తే క్యూ4లో మొండి బకాయిల కేటాయింపులతో పోల్చితే ఇవి రూ.29,625 కోట్లు

Most from this category