News


పెన్నార్‌కు రూ.317 కోట్ల ఆర్డర్లు

Friday 23rd November 2018
news_main1542947795.png-22322

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ ప్రొడక్ట్స్, సొల్యూషన్స్‌ సంస్థ పెన్నార్‌ గ్రూప్‌కు రూ.317 కోట్ల ఆర్డర్‌ దక్కింది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌కు సోలిస్‌ ఇంజనీరింగ్, జేఎం ఇన్‌ఫ్రాటెక్, ఐఎఫ్‌బీ, అశోక్‌ లేల్యాండ్, టెకమ్‌సే, వాబ్‌కో, మహీంద్రా, సేలం స్టీల్‌ సంస్థల నుంచి రూ.190 కోట్ల రైల్వే, ట్యూబ్స్, పారిశ్రామిక విడిభాగాల ఆర్డర్లు వచ్చాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక, పెన్నార్‌ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్‌కు (పెబ్స్‌ పెన్నార్‌) పోకర్ణా, జెమినీ ఆయిల్స్, సుగుణ ఫుడ్స్, వన్‌ సుగర్స్‌ నుంచి రూ.127 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు గ్రూపు వైస్‌ ప్రెసిడెంట్‌ (కమ్యూనికేషన్స్‌) కె.ఎం.సునీల్‌ తెలియజేశారు. ఈ ఆర్డర్లను 7-8 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం పెబ్స్‌ పెన్నార్‌ ఆర్డర్‌ బుక్‌ రూ.422 కోట్లుగా ఉంది.
 



You may be interested

భారతీ ఆక్సా లైఫ్‌ వ్యాపారంలో 52 శాతం వృద్ధి

Friday 23rd November 2018

ముంబై: భారతీ ఎయిర్‌టెల్‌, ఆక్సా గ్రూపు జాయింట్‌ వెంచర్‌ కంపెనీ భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నూతన వ్యాపార ప్రీమియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ కాలంలో 52 శాతం పెరిగి రూ.398 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.262 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ఇక రెన్యువల్‌ ప్రీమియం ఆదాయం సైతం 21 శాతం వృద్ధితో రూ.453 కోట్లుగా నమోదైంది. మొత్తం ప్రీమియం చూస్తే.. 34

టెలికం కార్యదర్శితో బిర్లా భేటీ

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: దిగ్గజ టెల్కో వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా గురువారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌తో మరోసారి భేటీ అయ్యారు. వొడాఫోన్‌ ఐడియా సీనియర్ అధికారులు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వైస్‌-చైర్మన్ హిమాంశు కపానియా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టెలికం రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. అయితే, చర్చల వివరాలను

Most from this category