STOCKS

News


పీసీ జ్యుయలర్‌ లాభాలు 38 శాతం డౌన్‌

Thursday 15th November 2018
news_main1542259250.png-22036

న్యూఢిల్లీ: పీసీ జ్యూయలర్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.94 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం (రూ.151 కోట్లు)తో పోల్చితే 38 శాతం క్షీణించిందని పీసీ జ్యుయలర్‌ తెలిపింది. అమ్మకాలు అంతంతమాత్రంగా ఉండటంతో నికర లాభం తగ్గిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.2,622 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ2లో రూ.1,635 కోట్లకు తగ్గిందని వివరించింది. దేశీయ అమ్మకాలు రూ.1,851 కోట్ల నుంచి రూ.1,550 కోట్లకు, ఎగుమతుల ఆదాయం రూ.771 కోట్ల నుంచి రూ.83 కోట్లకు తగ్గాయని తెలిపింది. 



You may be interested

రాయల్‌ సుందరంలో ఏజీస్‌కు వాటా!

Thursday 15th November 2018

చెన్నై: సుందరం ఫైనాన్స్‌ సంస్థ, సాధారణ బీమా కంపెనీ రాయల్‌ సుందరంలో తనకున్న 75.90 శాతం వాటా నుంచి 25.90 శాతం వాటాను ఏజీస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ రూ.1,520 కోట్లు. విక్రయం తర్వాత కూడా రాయల్‌ సుందరంలో సుందరం ఫైనాన్స్‌కు 50 శాతం వాటా ఉంటుంది. ఈ డీల్‌ ఐఆర్‌డీఏ తదితర సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని, 2019 మొదటి మూడు

ఫిన్‌టెక్ దిగ్గజంగా భారత్‌..

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: టెక్నాలజీ తోడ్పాటుతో భారత్‌లో భారీ స్థాయిలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో ప్రపంచంలోనే ఫైనాన్షియల్‌ టెక్నాలజీకి (ఫిన్‌టెక్‌) సంబంధించి దిగ్గజ దేశాల్లో ఒకటిగా భారత్‌ ఎదిగిందన్నారు. స్టార్టప్‌ సంస్థలకు హబ్‌గా నిలుస్తున్న భారత్‌.. పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారిందని కూడా చెప్పారాయన. సింగపూర్‌లో జరుగుతున్న 3వ ఫిన్‌టెక్‌ సదస్సులో కీలకోపన్యాసం చేసిన మోదీ... ‘‘భారత్‌లో పాలనా స్వరూపాన్ని, ప్రజలకు అందించే సేవలను టెక్నాలజీ

Most from this category