STOCKS

News


పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా చాహెల్‌ నియమాకం

Saturday 20th April 2019
Markets_main1555748905.png-25244

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ సైరీ చాహల్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం చాహల్‌  ‘‘షీరోస్ డాట్ ఇన్‌’’ కంపెనీ ఫౌండర్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థ మధ్య వయస్సు మహిళలకు ఇంటి దగ్గరే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. వినియోగదారుల సేవారంగంలో అపారమైన అనుభవం కలిగిన చాహల్‌ బోర్డు సభ్యురాలుగా నియామితులు కావడం తనకెంతో గర్వంగా ఉందని పీపీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సతీష్‌ గుప్తా తెలిపారు. ఆమె అనుభవం, పరిజ్ఞానం సంస్థ ఎదుగుదలకు ఉపయోగపడుతుందని గుప్తా అన్నారు. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మకు పీపీబీ 51శాతం వాటా కలిగి ఉన్నారు. పీఎన్‌బీలో 4.4 కోట్ల సేవింగ్స్‌ అకౌంట్లతో పాటు 26 కోట్ల వాలెట్‌ అకౌంట్లు కలిగి ఉంది.



You may be interested

ఓపెన్‌ మార్కెట్లో స్పెక్ట్రం కొనేందుకు జియో సిద్ధం!

Saturday 20th April 2019

టెలికం సేవలు అంతరాయాలు లేకుండా అందించేందుకు ఓపెన్‌ మార్కెట్లో స్పెక్ట్రం కొనుగోలు చేయాలని రిలయన్స్‌ జియో భావిస్తోంది. ప్రస్తుతం జియోకు 30 కోట్ల సభ్యులున్నారు. నెలకు కొత్తగా కోటిమందిని చేర్చుకుంటోంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆర్‌కామ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని టెలికం శాఖ అభ్యంతరాల కారణంగా రద్దు చేసుకుంది. ఆర్‌కామ్‌ నుంచి స్పెక్ట్రం కొనుగోలు చేయాలని జియో భావించినా, ఆర్‌కామ్‌ బకాయిల విషయంలో డీఓటీ పెట్టిన షరతులను ఒప్పుకోలేక ఒప్పందం రద్దు

ద్విచక్ర వాహన బీమా సేవల్లోకి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

Saturday 20th April 2019

న్యూఢిల్లీ: టూవీలర్‌ బీమా సేవల్లోకి ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కూడా అడుగుపెట్టింది. భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో ఈ సేవలను అందించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 40,000 ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ పాయింట్లు, మైఎయిర్‌టెల్‌ యాప్‌లో ఆకర్షణీయమైన ద్విచక్ర వాహన బీమా ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలియజేసింది. ‘‘వ్యక్తిగత ప్రమాద బీమా, థార్డ్‌ పార్టీ లయబిలిటీ ప్రొటక్షన్‌.. తనిఖీ రహిత, అత్యంత వేగవంతమైన రెన్యువల్‌ వంటి ఆఫర్లు

Most from this category