STOCKS

News


క్యాష్‌బ్యాక్ మోసం @ రూ. 10 కోట్లు

Wednesday 15th May 2019
news_main1557900713.png-25746

  • పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ
  • వాట్సాప్‌పై యూటర్న్

ముంబై: ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్‌ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని తమ అంతర్గత విచారణలో తేలినట్లు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. "దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్ లభిస్తుండటాన్ని మా టీమ్ గుర్తించింది. దీన్ని మరింత లోతుగా పరిశీలించాలని మా ఆడిటర్లను కోరాం" అని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఆడిటింగ్ సంస్థ ఈవై నిర్వహించిన ఆడిట్‌లో కొందరు జూనియర్ స్థాయి ఉద్యోగులు, సంస్థలు కుమ్మక్కై ఈ క్యాష్‌బ్యాక్ కుంభకోణానికి తెరతీసినట్లు వెల్లడైందని ఆయన వివరించారు. మరోవైపు, ఇప్పటిదాకా పేమెంట్స్ వ్యవస్థలోకి మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్ శేఖర్ శర్మ తాజాగా స్వరం మార్చారు. వాట్సాప్ లాంటి సంస్థల రాక స్వాగతించతగ్గ పరిణామమేనన్నారు. భారతీయ చట్టాలను పాటించడానికి సిద్ధంగా లేని సంస్థలను మాత్రమే తాను వ్యతిరేకించానని ఆయన చెప్పారు.

క్యాష్‌బ్యాక్‌లిచ్చినా ఫర్వాలేదు ...
క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో వ్యాపారం లాభసాటిగా ఉండదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఇలాంటివి ఇచ్చినా వ్యాపారం నిలదొక్కుకోగలదని శర్మ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరింత మంది యూజర్లు, వ్యాపారులకు చేరువయ్యేందుకు భారీగా వ్యయాలు చేస్తున్నందున లాభాల్లోకి మళ్లేందుకు మరికాస్త సమయం పట్టవచ్చన్నారు. యూజర్ల సంఖ్య 30 నుంచి 50 కోట్ల దాకా, వ్యాపార సంస్థల సంఖ్య ప్రస్తుతమున్న 1.2 కోట్ల నుంచి 4 కోట్లకు పెరిగేదాకా లాభాలు నమోదు కాకపోవచ్చని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. You may be interested

ఏడాది కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Wednesday 15th May 2019

యస్‌ బ్యాంకు షేర్లు బుధవారం ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో రూ.154.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో 6శాతం నష్టంతో రూ. 146.85ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఈ ధర షేరు ఏడాది కనిష్ట ధరని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యస్ బ్యాంక్ అదనపు డైరెక‍్టరుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ నియమితులమైన సంగతి

ఇండిగో సమ్మర్‌ ఆఫర్‌ సేల్‌

Wednesday 15th May 2019

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో... రూ.999కే టికెట్ అందిస్తోంది. ‘3-డే సమ్మర్‌ సేల్‌’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్‌ వర్తిస్తుంది. ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-హైదరాబాద్, హైదరాబాద్-దుబాయ్, చెన్నై- కువైట్, ఢిల్లీ-కౌలాలంపూర్, బెంగళూరు-మాల్దీవ్‌ రూట్లలో ఆఫర్‌ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ అంశంపై సంస్థ

Most from this category