STOCKS

News


పేటీఎం మాల్‌ నుంచి ఫ్రీడమ్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ ఆఫర్‌

Thursday 9th August 2018
news_main1533810624.png-19107

పండుగ సీజన్‌ అమ్మకాలను పేటీఎం మాల్‌ ఆరంభించింది. ఫ్రీడమ్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ ఆఫర్‌ పేరిట కొత్త సీజన్‌ను షురూ చేసింది.

ఈ నెల 8 నుంచి 15 మధ్యన ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆఫర్‌లో భాగంగా మొబైల్స్‌, ఫాషన్‌, అప్లయెన్సెస్‌, ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కిచెన్‌ అండ్‌ హోమ్‌ తదితర విభాగాలకు చెందిన పది కోట్ల ఉత్పత్తులను అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది.

ఈ ఆఫర్‌ కోసం పేటీఎం మాల్‌ వెయ్యి బ్రాండ్లతో జట్టు కట్టింది. ఆఫర్‌ ప్రమోషన్‌ కోసం వంద కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఓ2ఓ కామర్స్‌ విభాగంలో తమ మాల్‌ మంచి వృద్ధి నమోదు చేస్తోదని తెలిపింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని వివరించింది. అందుకే ఈ రంగంపై ఎక్కవ శ్రద్ద పెడుతున్నామని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ప్లాట్‌ఫామ్‌పై 75 వేల బ్రాండ్స్‌ లభిస్తున్నాయి. 



You may be interested

ఆగని రికార్డుల హోరు

Thursday 9th August 2018

సూచీల మరో కొత్త రికార్డు ముగింపు  38వేల శిఖరంపైకి సెన్సెక్స్‌ ముంబై:- మార్కెట్‌లో సూచీల రికార్డు ర్యాలీ ఆగడం లేదు. బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల అండతో రెండో రోజూ అటు ఇంట్రాడేలోనూ, ఇటు ముగింపులోనూ కొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభపడి 38024 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 11,470 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 38000 శిఖరాన్ని అధిరోహించి 38076 వద్ద తన జీవితకాల

ఆసుస్‌ ‘బ్యాక్‌ టు కాలేజ్‌’ ఆఫర్‌

Thursday 9th August 2018

కుర్ర కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసుస్‌సంస్థ బ్యాక్‌ టు కాలేజ్‌తో పాటు పలు ఆఫర్లను ప్రకటించింది. బ్యాక్‌ టు కాలేజ్‌ ఆఫర్‌: ఈ ఆఫర్‌లో భాగంగా ఆసుస్‌ సంస్థ నోట్‌బుక్స్‌ కొనుగోలు చేసినవారికి వారెంటీ పొడిగింపు ఉంటుంది. ఆసుస్‌నోట్‌ బుక్‌ కొనుగోలు దారులు రూ. 499, గేమింగ్‌ నోట్‌బుక్‌ కొనుగోలుదారులు రూ. 999 చెల్లించి రెండేళ్ల వారెంటీ, రూ. 999, రూ. 1499 చెల్లించి మూడేళ్ల వారెంటీ పొడిగింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌

Most from this category